YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఆశతో రామ్మోహన్ నాయుడు

ఆశతో రామ్మోహన్ నాయుడు

శ్రీకాకుళం, జూన్ 1,
తెలుగుదేశం పార్టీకి ఉన్న ఆశాకిరణాల్లో శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఒకరు. రెండు సార్లు ఎంపీ అయిన రామ్మోహన్ బాగానే రాణిస్తున్నారు. చంద్రబాబు నచ్చిన మెచ్చిన నాయకుడిగా ఉంటున్నారు. బాబాయ్ అచ్చెన్నాయుడుతో ఎలా ఉన్నా రామ్మోహన్ నాయుడు అంటే లోకేష్ కూడా ఇష్టపడతారుట‌. ఇక చంద్రబాబు వద్ద చనువు బాగా ఉన్న నాయకులలో రామ్మోహన్ పేరుని కూడా చెబుతారు. పార్టీకి సంబంధించి ఫీడ్ బ్యాక్ ని ఇవ్వడంతో పాటు తప్పొప్పులను ఆయన ఏకంగా బాబుతోనే చర్చిస్తారు అని కూడా అంటారు.రామ్మోహన్ నాయుడు విమర్శలు చేస్తే అర్ధవంతంగా ఉంటాయని అధికార వైసీపీ కూడా ఒప్పుకుంటుంది. ఆయన ఊరకే అనాలని ఎవరినీ అనరని, విషయం ఉంటేనే నోరు చేస్తారని కూడా వైసీపీ నేతలు చెబుతారు. అలాంటి రామ్మోహన్ నాయుడు రూట్ మార్చేశారని వైసీపీలో ఇపుడు వినిపిస్తున్న మాట. అచ్చెన్నాయుడు మాదిరిగానే రామ్మోహన్ కూడా అయిన దానికీ కానిదానికీ వైసీపీ మీద విమర్శలు చేయడం ఇటీవల కాలంలో ఎక్కువైందిట. మరి ఈ యువ ఎంపీ పాతకాలం నాటి రొచ్చు రాజకీయాలను ఎందుకు అనుసరిస్తున్నారు అన్నది కూడా శ్రీకాకుళం జిల్లాలో చర్చగా ఉందిపుడు.మహానాడు లాంటి సమావేశాలు జరిగినపుడు రామ్మోహన్ నాయుడు వంటి యువ నాయకులు పార్టీకి కొన్ని నిర్మాణాత్మకమైన సూచనలు చేసేవారు. అలాంటిది ఈసారి మాత్రం ఏకంగా వైసీపీని దుమ్మెత్తి పోసే కార్యక్రమానికి రామ్మోహన్ తెర తీశారు. ఆయన చేసే విమర్శలు కూడా రొటీన్ గా ఉన్నాయి. ఇక తెలుగుదేశం ఈ రోజు ఈ రకమైన స్థితిలో ఉంటే మళ్లీ పూర్వ వైభవం పొందేందుకు సూచనలు కూడా చేయలేదన్న మాట వినిపిస్తోంది. రేపటి రోజులురామ్మోహన్ నాయుడు లాంటి వారివి. పార్టీని మరింతకాలం నడిపించాల్సిన యువ నాయకులే తమను తాము మభ్య పెట్టుకుంటూ అధినాయకత్వాన్ని కీర్తిస్తూ చేసే ఊకదంపుడు ఉపన్యాసాల వల్ల ఒరిగేది ఎముంటుంది అన్నదే సొంత పార్టీలో తమ్ముళ్ల ఆవేదనట.ఎటూ అచ్చెన్నాయుడికి అధినాయకత్వానికి కొంత ఎడం ఏర్పడింది. దాంతో ఈ రోజు కాకపోయినా రేపటి నాడు అయినా ఏపీ టీడీపీ అధ్యక్ష పదవికి తన పేరుని పరిశీలిస్తారేమో అన్న ఆశతో రామ్మోహన్ నాయుడు ఉన్నారని అంటున్నారు. అందువల్లనే ఆయన పార్టీ పోకడల పట్ల గతంలో అసంతృప్తిగా ఉన్నా కూడా ఇపుడు కనీసం వాటిని ప్రస్తావించలేదని గుర్తు చేస్తున్నారు. అదే విధంగా రాష్ట్ర రాజకీయాల్లో రాణించాలన్నది కూడా రామ్మోహన్ నాయుడు ఆశట. సరే ఎవరికి ఏ ఆశలు ఉన్నా కూడా పార్టీ అంటూ గట్టిగా ఉండాలి కదా అన్నదే తమ్ముళ్ల వేదనగా ఉంది మరి. టీడీపీని సరైన దారిలో నడిపించేలా కొందరు నాయకులు అయినా సలహాలు సూచనలు ఇస్తే అధినాయకత్వం తీరు మారుతుందని, లేకపోతే ఆత్మ స్తుతి పరనిందతోనే కాలం గడచిపోతుందని కూడా పార్టీలో వినిపిస్తున్న మాట. మొత్తానికి వైసీపీని విమర్శించడంలో ఇపుడు బాబాయ్ తో అబ్బాయ్ బాగానే పోటీ పడుతున్నాడనుకోవాలి.

Related Posts