YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ దేశీయం విదేశీయం

పాక్‌ చెర నుంచి హైదరాబాద్‌ యువకుడి విడుదల

పాక్‌ చెర నుంచి హైదరాబాద్‌ యువకుడి విడుదల

హైదరాబాద్‌
ప్రియురాలి కోసం వెళ్తూ పాక్‌లో పట్టుబడి నాలుగేళ్ల జైలు జీవితం గడిపిన యువకుడు ఎట్టకేలకు విడుదలయ్యాడు. సోమవారం వాఘా సరిహద్దుల్లో భద్రతా దళాలకు యుకుడిని పాక్‌ రేంజర్స్‌ అప్పగించారు. ఇవాళ, సాయంత్రం, లేదంటే రేపు హైదరాబాద్‌ చేరుకోనున్నాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పని చేస్తున్న ప్రశాంత్‌ 2017లో అదృశ్యమయ్యాడు. తన ప్రియురాలి కోసం పాకిస్తాన్‌ మీదుగా స్విట్జర్లాండ్‌కు బయలుదేరాడు. ఈ క్రమంలో అనుకోకుండా పాక్‌ భూభాగంలోకి వెళ్లాడు. దీంతో అక్రమంగా ప్రవేశించాడనే కారణంతో అతనిపై అధికారులు కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.
ప్రశాంత్‌ను పాక్‌ అరెస్టు చేసినట్లు అతన్ని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని భారత్‌ కోరింది. సరైన ధ్రువీకరణపత్రాలు లేకపోవడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు అప్పట్లో పేర్కొన్నారు. 2019లో తన కొడుకును రప్పించే ప్రయత్నం చేయాలని ప్రశాంత్ తండ్రి బాబూరావు సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను కోరారు. ఈ విషయమై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి విడుదల కోసం చొరవ చూపారు. సుమారు నాలుగేళ్ల తర్వాత తమ కొడుకు ఇంటికి చేరనుండడంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విడుదల కోసం కృషి చేసిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

Related Posts