YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

‘ఘర్ వాపసీ’కి బిజెపి నేతల క్యూ... ఖండించిన బీజేపీ నాయకత్వం

‘ఘర్ వాపసీ’కి బిజెపి నేతల క్యూ...   ఖండించిన బీజేపీ నాయకత్వం

కోల్‌కతా జూన్ 1
మొన్నటి బంగాల్ ఎన్నికలకు ముందు తృణమూల్ నుంచి అనేకమంది నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకోవడం సంచలనం కలిగించింది. ఇక తృణమూల్ పని అయిపోయినట్టే అనుకున్నారు. మమత దీదీ రిటైర్ మెంట్ తప్పదని కొందరు జోస్యాలు కూడా చెప్పారు. కానీ మూడోవిడత దిగ్విజయంగా నిలిచి చరిత్ర తిరగరాశారు దీదీ. ఇప్పుడు వెనుకకు వలసలు మొదలయ్యాయి. ఫిరాయింపుదారులు మరోసారి ప్లేటు ఫిరాయించి దీదీ నువ్వే దిక్కని అంటున్నారు. మాజీ ఎమ్మెల్యే సోనాలీ గుహా తృణమూల్ వదిలిపెట్టిన తర్వాత నీటిలోంచి బైటపడ్డ చేపలా ఉందని బేలగా మాట్లాడుతున్నారు. ఫుట్‌బాల్ క్రీడాకారుడు-రాజకీయ నేత అయిన దీపేందు బిశ్వాస్ మరోసారి తృణమూల్ జెండా పట్టుకుంటానని దీదీకి లేఖ రాశారు. సరళా ముర్మి, అమల్ ఆచార్య వంటి ఇతరులు కూడా మళ్లీ పుట్టింటికి వస్తామని సూచనలిస్తున్నారు. మాజీ మంత్రి రాజీబ్ బెనర్జీ కూడా ఇదే బాటలో ఉన్నట్టు తెలుస్తున్నది. నేతలు మాత్రమే కాదు, ఏడెనిమిది మంది సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు-నలుగురు ఎంపీలు తృణమూల్‌లో తిరిగి చేరడంపై ఆసక్తి చూపుతున్నారని తృణమూల్ అధికార ప్రతినిధి కుణాల్ ఘోష్ మీడియాకు చెప్పారు. అయితే పార్టీకోసం కష్టపడి పనిచేసి విజయం సాధించిన కార్యకర్తల మనోభావాలు కూడా దృష్టిలో ఉంచుకోవాల్సి ఉందని ఆయన అన్నారు. అందరికన్నా ముందు పార్టీని వదిలి బీజేపీలో చేరిన ముకుల్ రాయ్ కూడా వెనుకకు రావాలని చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను బీజేపీ నాయకత్వం ఖండించింది.
 

Related Posts