YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

హోం డెలివ‌రీ చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం అనుమ‌తి

హోం డెలివ‌రీ చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం అనుమ‌తి

న్యూఢిల్లీ జూన్ 1
సీఎం కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఆన్‌లైన్ లేదా మొబైల్ యాప్ ద్వారా మ‌ద్యం ఆర్డ‌ర్ ఇచ్చిన‌వారికి హోం డెలివ‌రీ చేసేందుకు అనుమ‌తి ఇచ్చింది. భార‌తీయ కంపెనీల‌కు చెందిన మ‌ద్యం కానీ.. విదేశాల‌కు చెందిన మ‌ద్యాన్ని అయినా ఇంటికి డెలివ‌రీ చేసుకునేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. క‌రోనా వ‌ల్ల లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను ఢిల్లీలో అమ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ నేప‌థ్యంలో ఎక్సైజ్ చ‌ట్టాల‌ను స‌వ‌రించారు. ఢిల్లీ అబ్కారీ శాక ప్ర‌క‌ట‌న ప్ర‌కారం.. ఎల్-13 లైసెన్సు ఉన్న షాపులు మ‌ద్యాన్ని హోం డెలివ‌రీ చేయ‌వ‌చ్చు. కానీ క‌చ్చితంగా ఆర్డ‌ర్ మాత్రం మొబైల్ యాప్ లేదా ఆన్‌లైన్ వెబ్ పోర్ట‌ల్ ద్వారా జ‌ర‌గాల్సిందే. అయితే హాస్ట‌ళ్లు, ఆఫీసులు, సంస్థ‌ల‌కు మాత్రం మ‌ద్యం హోండెలివ‌రీ ఉండ‌ద‌న్నారు. ఎల్-13 లైసెన్సు లేని వారు మ‌ద్యం హోం డెలివ‌రీ చేయ‌రాదు.

Related Posts