YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి తెలంగాణ

కార్పొరేట్ యాజమాన్యం చేతిలో ఇంటర్ బోర్డ్ అధికారులు బందీ... యూఎస్ఎఫ్ఐ జగిత్యాల జిల్లా కమిటీ

కార్పొరేట్ యాజమాన్యం చేతిలో ఇంటర్ బోర్డ్ అధికారులు బందీ...  యూఎస్ఎఫ్ఐ జగిత్యాల జిల్లా కమిటీ

జగిత్యాల జూన్ 01
తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యం చేతిలో ఇంటర్ బోర్డు అధికారులు పూర్తిగా బందీ అయ్యారని భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్( యూఎస్ఎఫ్ఐ) జగిత్యాల జిల్లా కమిటీ ఓ పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా సహాయ కార్యదర్శి సుజాయిత్ అలీ  మాట్లాడుతూ రాష్ట్రంలో రోజురోజుకు కార్పొరేట్, కొన్ని ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఆడింది ఆట పాడింది పాటగా మారుతోందని ,రాష్ట్రంలో  ఇంటర్మీడియట్ విద్య అంటే డబ్బున్న వాడిదే చదువుగా మారింది అనడంలో ఎలాంటి సందేహం లేదని వారు అన్నారు. ఇంటర్ బోర్డు అధికారులు యజమాన్యంలకు తలొగ్గి ఉండడం వల్లనే ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని అన్నారు. విద్యార్థుల అడ్మిషన్లు ప్రారంభించిన అధికారులు మాత్రం ఇప్పటివరకు గుర్తింపు ఉన్న కళాశాలల లిస్ట్ ప్రకటించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. గతంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల అనుమతిలేని కళాశాలల వల్ల అనేక మంది విద్యార్థులు రోడ్లు పాలయ్యారని గుర్తు చేశారు. ఇప్పటివరకు అనేక కార్పొరేట్ కళాశాలలు విచ్చలవిడిగా అడ్మిషన్లు చేస్తున్న ఇంటర్ బోర్డు అధికారులు స్పందించకపోవడంలో అంతర్యం ఏమిటని మండిపడ్డారు. అనేక ఇంటర్మీడిట్ కళాశాలలో టెక్నో, టైటాన్  నీట్ ,ఐఐటి తదితర ముద్దు పేర్లతో లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నాయని అధికారులు ఎందుకు విచారణ జరపడం లేదని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, విద్య పేరుతో బ్రోకర్ ఈజం చేస్తున్న బ్రోకర్లు పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని,అలాగే ఫీజులపై నిర్దిష్టమైన ప్రకటన చేయాలని, కనీస వసతులు లేని కళాశాల గుర్తింపు రద్దు చేయాలని, అనుమతి లేని కళాశాలల పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని సుజాయిత్ అలీ డిమాండ్ చేశారు. 

Related Posts