YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రఘురామది స్వార్థ పూరిత పిటీషన్

రఘురామది స్వార్థ పూరిత పిటీషన్

హైదరాబాద్, జూన్ 1, 
వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా జగన్ తరపు న్యాయవాదులు 98 పేజీల కౌంటర్‌ను దాఖలు చేశారు. బెయిల్‌ షరతులను జగన్‌ ఎక్కడా ఉల్లంఘించలేదని, సీబీఐని ప్రభావితం చేస్తున్నారన్న పిటిషనర్‌ వాదనలో నిజం లేదని కౌంటర్ పిటిషన్లో పేర్కొన్నారు. సీబీఐ కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తుందని, రఘురామరాజుకు ఈ కేసుతో సంబంధం లేదని జగన్ తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. ఇలాంటి కేసుల్లో థర్డ్‌ పార్టీ జోక్యం చేసుకోవద్దని గతంలో సుప్రీంకోర్టు తీర్పులున్నాయని ఈ సందర్భంగా న్యాయవాదులు గుర్తుచేశారు. పిటిషనర్ రఘురామ కృష్ణంరాజు తన పిటిషన్లో వాడిన భాష తీవ్ర అభ్యంతరకరంగా ఉందని జగన్ తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. రఘురామకృష్ణంరాజు రూ.900 కోట్లు బ్యాంకులను మోసం చేసిన కేసులో నిందితుడుగా ఉన్నారని, ఆయనపై సీబీఐ కేసులు ఉన్నాయని, వాటి విచారణ ఇంకా కొనసాగుతోందని తెలిపారు. పిటిషనర్ వైసీపీ పార్టీ ఎంపీగా కొనసాగుతూనే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఆయన్ని అనర్హుడిగా ప్రకటించాలని ఇప్పటికే స్పీకర్‌ను లేఖ రాసినట్లు తెలిపారు. రఘురామరాజు తన వ్యక్తిగత, స్వార్థ ప్రయోజనాల కోసం కోర్టును ఉపయోగించుకోవాలని చూస్తున్నారని జగన్ తన కౌంటర్ పిటిషన్లో పేర్కొన్నారు. ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు ఇప్పటికే జగన్, సీబీఐ మూడు సార్లు గడువు కోరారు. దీంతో న్యాయస్థానం జూన్ 1 చివరి అవకాశంగా ఇచ్చింది. దీంతో జగన్ తరపు న్యాయవాదులు ఈరోజు కౌంటర్ దాఖలు చేశారు. అనంతరం దీనిపై విచారణను న్యాయస్థానం ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది.

Related Posts