YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

శరద్ తో ఫడ్నవిస్ భేటీ

శరద్ తో ఫడ్నవిస్ భేటీ

ముంబై,  జూన్ 1, 
ఎన్‌సీపీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్‌ను మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేతదేవేందర్ ఫడ్నవీస్ కలవడంతో మరోసారి మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. మీడియాలో ఊహగానాలు వెలువడుతున్న నేపథ్యంలో దేవేందర్ ఫడ్నవీస్ స్పష్టతనిచ్చారు. పవార్‌ను మర్యాదపూర్వకంగానే కలిసినట్టు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ముంబయిలోని శరద్ పవార్ నివాసానికి ఉదయం వెళ్లిన ఫడ్నవీస్.. ఆయనను కలుసుకున్నారు. పవార్‌ను కలిసిన ఫోటోను మాజీ సీఎం ట్విట్టర్‌లో షేర్ చేశారు.‘కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత శరద్ పవార్‌ను ముంబయిలోని ఆయన నివాసంలో కలిశాను.. ఇది మర్యాదపూర్వక సమావేశం మాత్రమే’’అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇటీవల గాల్ బ్లాడర్ శస్త్రచికిత్స జరగడంతో ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీసినట్టు దేవేందర్ తెలిపారు. మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అంశంపై మహారాష్ట్రలో రాజకీయాలు వేడెక్కిన తరుణంలో ఇరువురు నేతలూ సమావేశం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.అత్యంత సున్నితమైన రిజర్వేషన్ల అంశాన్ని నేరవేర్చడంలో ఉద్ధవ్ సర్కారు విఫలమైందని ప్రధాన ప్రతిపక్ష నేత ఫడ్నవీస్, మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్‌లు విమర్శలు గుప్పించారు. మరాఠాలకు రిజ్వరేషన్లు కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఇటీవల నిలుపుదల చేసిన విషయం తెలిసిందే.ఈ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వ సరైన వాదనలు వినిపించలేదని ప్రతిపక్ష బీజేపీ ఆరోపిస్తోంది. దీనికి నిరసనగా జూన్ 5న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు బీజేపీ సిద్ధమయ్యింది. మరాఠా కోట రాజ్యాంగ విరుద్ధమని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని సర్వోన్నత న్యాయస్థానం గుర్తుచేసింది.అలాగే, కోవిడ్ రెండో దశ వ్యాప్తి నియంత్రించడంలో మహావికాస్ అఘాడీ ప్రభుత్వం పూర్తి విఫలమయ్యిందని ఫడ్నవీస్ ధ్వజమెత్తారు. 2019 ఎన్నికల తర్వాత మహారాష్ట్రలో శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే.

Related Posts