హైదరాబాద్, జూన్ 1,
మంత్రి కేటీఆర్‌ని శ్రీరెడ్డి ఇరికించేయడం ఏంటి? అసలేమైందో తెలియాలంటే అంతకు ముందు జరిగిన వైరల్ న్యూస్ కోసం ముచ్చటించాల్సిందే. అదేంటంటే.. ట్విట్టర్‌లో తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు, కరోనా కష్టకాలంలో ఎందరికో ఆపన్నహస్తం అందిస్తోన్న సోనూసూద్ మధ్య తాజాగా ఆసక్తికర సంభాషణ జరిగింది. ఈ సమయంలో 20,000 మందికి పైగా ఏం చేస్తున్నారో తెలుసా? మీరే చూడండి తెలంగాణకు చెందిన నంద కిషోర్ అనే కరోనా రోగి ట్విట్టర్ వేదికగా కృతజ్ఞత తెలుపుతూ.. తాను కోరిన వెంటనే కేటీఆర్ ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను కేవలం 10 గంటల వ్యవధిలోనే అందించి తన ప్రాణం కాపాడారని తెలియజేస్తూ కేటీఆర్‌ని సూపర్ హీరోగా అభివర్ణిస్తూ ఆయన్ని ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్‌పై రియాక్ట్ అయిన కేటీఆర్.. బ్రదర్.. నేను మీచే ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధిని. నావంతు బాధ్యత మాత్రమే చేస్తున్నా.. మీరు చెప్పిన సూపర్ హీరో కచ్చితంగా సోనుసూద్. అతనికి కృతజ్ఞతలు చెప్పండి అంటూ సోనూసూద్‌ని ట్యాగ్ చేసి రిప్లై ఇచ్చారు. అయితే కేటీఆర్ ట్వీట్‌ని సోనూసూద్ స్పందిస్తూ.. ‘మీ ప్రేమ ధన్యవాదాలు సార్.. మీరు నిజంగా తెలంగాణ కోసం ఎంతో చేసిన హీరో. మీ నాయకత్వంలో రాష్ట్రం చాలా అభివృద్ధి చెందింది. నేను తెలంగాణను నా రెండో ఇంటిగా.. నా వర్క్ స్టేషన్‌గా భావిస్తున్నా.. ఎన్నో ఏళ్లుగా తెలంగాణ ప్రజలు నాపై చాలా ప్రేమను చూపించారు’ అంటూ సోనూసూద్‌ని పొగడ్తలతో ముంచెత్తారు. మొత్తానికి వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ కాగా.. దీన్ని మెగాస్టార్ చిరంజీవితో లింక్ చేస్తూ కేటీఆర్ ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది నటి శ్రీరెడ్డి.చూశారా?? కేటీఆర్ సార్ కూడా సోనూసూద్‌ని రియల్ హీరోగా అభివర్ణించారు.. ఎందుకు చిరంజీవి రియల్ హీరో అని అనలేదు. ఎందుకంటే నిజం ఏంటన్నది ఆయనకు తెలుసుకాబట్టి’ అంటూ ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి. ఓ వైపు మెగాస్టార్ చిరంజీవి కోట్లు ఖర్చు పెట్టి ఆక్సిజన్ బ్యాంక్‌లను ఏర్పాటు చేసి ఎంతోమంది కరోనా బాధతులకు ఊపిరి అందించనున్నారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో నిరంతరాయంగా ఆక్సిజన్ పంపిణీ కొనసాగుతుంది. చైనా నుంచి ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లు ఆర్డర్ చేసి ఆక్సిజన్ కొరత లేకుండా చేస్తున్నారు. స్వయంగా చిరంజీవి, రామ్ చరణ్ రామ్ చరణ్ ఈ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేస్తున్నారు.దీంతో పాటు సీసీఎస్ ద్వారా చిరంజీవి వేలాది మంది సినీ కార్మికులకు నిత్యవసర సరుకులు, నగదు అందిస్తూ తనకు తోచిన సాయం చేస్తున్నా.. ఆయనకి సరైన గుర్తింపు ఇవ్వడం లేదని.. పైగా సాయం చేస్తున్న చిరంజీవినే టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారంటూ మెగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మెగాస్టార్‌ని సోనూసూద్‌తో పోల్చుతూ విమర్శించాన్ని తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి బర్నింగ్ ఇష్యూలోకి కేటీఆర్‌ని లాగి.. సోనూసూద్‌ని పొగిడిన కేటీఆర్.. చిరంజీవిని అందుకే పొగడటం లేదని శ్రీరెడ్డి పోస్ట్ పెట్టడంపై మెగా అభిమానులు ఆగ్రహిస్తున్నారు. ఆయన చేసిన చేసిన, చేస్తున్న సాయం మీకు కనిపించడం లేదా? అని శ్రీరెడ్డిపై ఎప్పటిలాగే బూతుల దండకం అందుకున్నారు.