YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పండంటి విషం

పండంటి విషం

మార్కెట్‌లో నిగనిగలాడుతున్న మామిడిపండును చూడగానే నోరూరుతుంది. వెంటనే తినాలనిపిస్తుంది కదూ.. వేసవికాలం వచ్చిందంటే మామిడి పండ్లపై మక్కువ కలగడం సహజమే. ఎంత మక్కవ వున్నా.. మాగబెట్టినవి తినడం అన ర్థాలకు దారి తీస్తుంది. వాటిని కొనేముందు జాగ్రత్త సుమా..! సహజసిద్ధంగా పండాల్సిన వాటికి రసా యనాలు పులమడంతో ప్రమాదకరంగా మారుతున్నాయి. డిమాండ్‌ను బట్టి దళారులు కాల్షియం కార్బైడ్‌తో పండ్లను మాగబెట్టి మార్కెట్‌కు తరలిస్తున్నారు. వాటిని కొనే ముందు నాణ్యతను చూడాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఈ ఏడాది మామిడి పంట దిగుబడి అంతంతమాత్రంగానే వుంది. దానికి తోడు ఇటీవల వడగాలుతో అపార నష్టం వాటిల్లింది. చేతికందిన మామిడి నేలరాలింది. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని 218 హెక్టార్లలో 400 టన్నులకు పైగా మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. దీంతో మార్కె ట్‌లో మామిడిపండ్లకు కొరత ఏర్పడింది. మరో వైపు డిమాండ్‌ పెరిగింది. దీనిని ఆసరాగా తీసుకుని కొందరువ్యాపారులు, దళారులు కృత్రిమంగా పండిస్తున్నారు.

మామిడి పండ్లను సహజ సిద్ధంగా మాగబెట్టడమే శ్రేయస్కరం. ఇథలీన్‌ వాయువును ఉపయోగించేందుకు ప్రపంచ ఆరోగ్యసంస్థ అనుమతి వుంది. కాకపోతే ఈ విధానంపై రైతులకు తప్పనసరిగా అవగాహన వుండాలి. ఇథిలీన్‌ రైపనింగ్‌ ఛాంబర్స్‌ ఏర్పాటు, వాణిజ్యపరంగా ఇథరల్‌ వాయువు లభ్యతను గురించి తెలుసుకోవాలి. ఈ ప్రక్రియకు నాలుగు నుంచి ఐదు రోజుల సమయం పడుతుంది. ఇది పూర్తిగా సహజమైనది, సురక్షితమై విధానం. ఈ విధనాంలో మామిడి పండ్లు తాజాగా, ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.

మామిడి కాయలను మాగబెట్టేందుకు మామిడి వ్యాపారులు కాల్షియం కార్బైడ్‌ లాంటి విష రసాయనాలను వాడుతుంటారు. ఈ రసాయనాలను వాడకంతో కాన్సర్‌ వచ్చే ప్ర మాదం ఉంటుంది. దీంతో పండ్లను మాగబెట్టేందుకు కార్బైడ్‌ వాడకాన్ని ప్రభుత్వం నిషేధించింది. ప్రివెన్షన్‌ ఆఫ్‌ఫుడ్‌ అడలే్ట్రషన్‌ (పి.ఎఫ్.ఎ), 1954 యాక్ట్‌(చట్టం) , ప్రివెన్షన్‌ ఆఫ్‌ ఫుడ్‌ అడలే్ట్రషన్‌ రూల్స్‌, 1955 రూల్‌ నెంబ44(ఎఎ) ప్రకారం కాల్షియం కార్బైడ్‌తో పండ్లను మాగబెట్టడం నిషేధించారు. దీనిని అతిక్రమించిన వారికి మూడు సంవత్సరాలు జైలు శిక్షతో పాటు జరిమానా విధించబడుతుంది.

రసాయనాలతో పండించిన పండ్లను తింటే చర్మంపై దురద, కడుపులో మంట, అజీర్తి లాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వెనిగర్‌ను పండ్లపై పిచికారీ చేసి కొద్ది నిమిషాల తరువాత మంచినీళ్లలో శుభ్రం చేసి తింటే మెరుగైన ఫలితం వుంటుంది. కార్బైడ్‌తో మాగబెట్టిన పండ్లు అన్నీ ఒకే రంగులో ఉంటాయి. కాయ లోపల గుజ్జులో ఎలాంటి మార్పు ఉండదు. కేవలం రంగు చూసి మోసపోకుండా సహజసిద్దంగా మాగిన పండ్లను తీసుకోవాలి.సహజంగా మగ్గిన కాయల తొడిమల దగ్గర సువాసన వస్తుంది. అవి ముదురు ఎరుపు, పసుపు రంగులో ఉంటాయి. సహజంగా పండిన మామిడి పండ్లు నీటిలో మునుగుతాయి.

Related Posts