విశాఖపట్నం
ప్రతి వార్డుల్లో వాటర్, డ్రైనేజీ , పార్కులు లాంటి సమస్యలపై 98 వార్డులకు వార్డు డెవలప్మెంట్ ప్లాన్ లు సిద్ధం చెయ్యాలని నిర్ణయం టీసుకున్నామని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ముడసరలోవ రిజర్వాయర్ ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తాము. దీని కోసం 100 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి ని కొరాము. పంచ గ్రామాల సమస్యలు కోర్టులో ఉంది..తీర్పు రాగానే సమస్య పరిష్కారం చేస్తాము. స్లమ్స్ లో నివసిస్తున్న వారికి పట్టాలు ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. స్లమ్స్ ఫ్రీ సిటీ గా విశాఖ ను తీర్చి దిద్దే ప్రయత్నం చేస్తున్నాము. సింహాచల దేవస్థానం కొండ దేవస్థానం ఆస్తులు చుట్టూ వాల్ నిర్మిస్తాము. మూడు రాజధానులు అంశానికి కోర్టు కేసులు సంబంధం లేదు. ముఖ్యమంత్రి ఎక్కడ నుంచి ఐనా పాలన చెయ్యొచ్చు. త్వరలో విశాఖ నుంచి పాలన సాగుతుందని అన్నారు.