YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

కోడెలను కొడుకే హత్య చేశాడు

కోడెలను కొడుకే హత్య చేశాడు

గుంటూరు,  జూన్ 2, 
గుంటూరు జిల్లాలో మరోమారు డాక్టర్ కోడెల శివప్రసాదరావు కుటుంబం హాట్ ‌టాపిక్‌గా మారింది. అయితే ఈసారి కోడెల కొడుకో.. కూతురో కాదు.! ఆయన మేనల్లుడు కంచేటి సాయి వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశమైంది. కోడెల కొడుకుతో విభేదాల కారణంగా వైసీపీలో కొనసాగుతున్న సాయికి పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎదురులేకుండా పోయిందన్న వాదనలున్నాయి. కోడెల మేనల్లుడిగా పెదకూరపాడు నియోజకవర్గంలో కీలక నేతగా ఎదిగిన సాయి.. పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకరరావుకి దగ్గరయ్యారు.సామాజిక వర్గం కూడా ఒకటే కావడంతో కంచేటి సాయికి అడ్డు లేకుండా పోయిందని.. షాడో ఎమ్మెల్యే సాయి అని ప్రచారం సాగింది. ఎమ్మెల్యే కూడా ఆయనకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారని.. నియోజకవర్గంలో అన్ని పనులూ ఆయనే చక్కబెట్టేవారని తెలుస్తోంది. ఎమ్మెల్యే అండదండలతో షాడో ఎమ్మెల్యేగా చెలామణి అవుతున్న సాయి.. నియోజకవర్గ పరిధిలోని ఇసుక క్వారీలపై కన్నేశారన్న ఆరోపణలున్నాయి. కొద్ది రోజుల కిందటి వరకూ ఇసుక తవ్వకాలకు సరైన విధానమేదీ లేకపోవడంతో యథేచ్ఛగా ఇసుక తవ్వేసుకున్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి.అయితే ప్రభుత్వం ఇటీవల ఇసుక క్వారీలను కాంట్రాక్ట్ సంస్థలకు అప్పగించింది. అందులో భాగంగా అచ్చంపేట మండలం అంబడిపూడి క్వారీని జేపీ కన్‌స్ట్రక్షన్ కంపెనీకి కేటాయించింది. క్వారీలో పనులు చేపట్టేందుకు వచ్చిన సంస్థ ప్రతినిధులను షాడో ఎమ్మెల్యే కంచేటి సాయి అడ్డుకోవడంతో వివాదం రేగినట్లు తెలుస్తోంది. ఇసుక తవ్వకాలు చేపట్టేందుకు వీల్లేదని షాడో ఎమ్మెల్యే హుకుం జారీ చేసినట్లు సమాచారం. ప్రభుత్వం క్వారీ కేటాయించినా స్థానిక నాయకుడు అడ్డుకోవడం హాట్‌టాపిక్‌గా మారింది.క్వారీలో పనులు ప్రారంభించేందుకు వెళ్లిన జేపీ కన్‌స్ట్రక్షన్ ఉద్యోగులతో కంచేటి సాయి ఘర్షణకు దిగడంతో వివాదం ముదిరింది. కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులు ఏకంగా డీజీపీకి ఫిర్యాదు చేయడంతో కథ అడ్డం తిరిగింది. అధికార పార్టీ కీలక నేతగా ఉన్న కంచేటి సాయిపై కేసు నమోదైంది. ఆయన్ను సత్తెనపల్లి రూరల్ పోలీసులు సాయిని అరెస్టు చేసి.. స్టేషన్‌ బెయిలిచ్చి పంపించారు. ఆయనపై 323, 506, 431 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.అమరావతిలోని మరో ఇసుక క్వారీలోనూ ఇదే సీన్ రిపీటైనట్లు తెలుస్తోంది. అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను స్వాధీనం చేసుకున్న అమరావతి పోలీసులు.. వైసీపీ నాయకుడు సాయి సూచన మేరకు వదిలేసినట్లు ఆరోపణలున్నాయి. భారీ మొత్తంలో ముడుపులు అందుకుని వాహనాలను వదిలేయడం.. కీలక నేత సూచనతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇసుక విధానాన్ని పర్యవేక్షించడం లేదన్న ఆరోపణలు రావడంతో అమరావతి సీఐ ఉన్నతాధికారులు అంతర్గత విచారణ చేపట్టారు. స్థానిక నేతతో కలసి అక్రమాలకు పాల్పడ్డారని వచ్చిన ఆరోపణలు రుజువు కావడంతో అమరావతి సీఐపై ఉన్నతాధికారులు వేటు వేశారు. ఆయన్ను వెంటనే వీఆర్‌కి పిలిచారు.క్వారీలో పనులకు అడ్డుపడుతున్నారని కంపెనీ ప్రతినిధులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని సమాచారం. దీంతో కంపెనీ ప్రతినిధులు ఏకంగా డీజీపీని కలిసి ఫిర్యాదు చేయడంతో సత్తెనపల్లి రూరల్ పోలీసులు రంగంలోకి దిగారు. అయితే అధికార పార్టీ నేత.. షాడో ఎమ్మెల్యే అరెస్టు జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయన వ్యవహారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. నేడోరేపో పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్‌రావును సీఎం జగన్ పిలిపించే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.వైసీపీ నేత కంచేటి సాయి కోడెల మేనల్లుడిగా జిల్లాలో సుపరిచితుడు. అయితే మేనమామ కుంటుంబంతో పొసగక ఆయన వైసీపీలో చేరినట్లు చెబుతారు. అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య సమయంలోనూ సాయి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. తన మేనమామ కోడెల ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని.. ఆయన కొడుకు పెదబాబే హత్య చేసి పారిపోయాడని సంచలన ఆరోపణలు చేశారు. కోడెల మరణంపై తనకు అనుమానాలు ఉన్నాయని.. విచారణ జరిపించాలని కోరుతూ సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. ఇప్పుడు తాజా వివాదంతో మరోమారు హాట్‌టాపిక్‌గా మారారు.

Related Posts