YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి చేదు అనుభవం

మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి చేదు అనుభవం

అదిలాబాద్, జూన్ 2, 
నిర్మల్ జిల్లా భైంసా పర్యటనకు వెళ్లిన మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. నిర్మల్ పట్టణంలోని వైకుంఠ ధామం ప్రారంభోత్సవానికి మంత్రి అతిథిగా వచ్చారు. అయితే, అక్కడ ఉన్న జనం ఒక్కసారిగా మంత్రిని ముందుకు పోనివ్వకుండా అడ్డుకున్నారు. నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. రోడ్డు వెడల్పులో తమ ఇళ్లను కూల్చేశారని మంత్రి ఎదుట పలువురు నిరసనకు దిగారు. దీంతో ఆయన అసహానానికి గురయ్యారు.జనం నిరసనతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో మంత్రి కలగజేసుకొని ఈ సమస్య గురించి మీ స్థానిక ఎమ్మెల్యేను అడగాలని తేల్చి చెప్పారు. వెంటనే అసంతృప్తిగా ఇంద్రకరణ్‌ రెడ్డి వెళ్లిపోయారు. మంత్రి ప్రవర్తించిన తీరుపై బాధితులు మండిపడ్డారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.అంతకుముందు నిర్మల్ కలెక్టరేట్లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుక‌ల్లో మంత్రి పాల్గొని మంత్రి మాట్లాడుతూ.. ఏడేళ్లుగా రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకుపోతోందని మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో కోట్లాది మందిని ఏకం చేసి తెలంగాణ ఉద్యమ ర‌థసార‌ధి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామ‌ని చెప్పారు. అమ‌ర‌వీరుల స్థూపానికి, ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ చిత్రప‌టానికి నివాళుల‌ర్పించారు. ప్రజ‌ల‌కు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరుల సేవ‌ల‌ను మంత్రి గుర్తు చేసుకున్నారు.

Related Posts