YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బెజవాడ ఎంపీపై గురి

బెజవాడ ఎంపీపై గురి

విజయవాడ, జూన్ 3, 
ఏపీలో వైసీపీ అధికారంలోకి వ‌చ్చి అప్పుడే రెండేళ్లు దాటుతోంది. మ‌రో రెండేళ్ల త‌ర్వాత అప్పుడే ఎన్నిక‌ల వేడి స్టార్ట్ అయిపోతుంది. స్థానిక సంస్థల ఎన్నిక‌ల త‌ర్వాత జ‌రిగిన అన్ని ఎన్నిక‌ల్లోనూ వైసీపీ తిరుగులేకుండా వార్ వ‌న్‌సైడ్ చేసేస్తోంది. ప్రతిప‌క్ష పార్టీకి చెందిన కీల‌క నేత‌లు, ఎమ్మెల్యేలు ఉన్న నియోజ‌కవ‌ర్గాల్లోనూ ఎక్కడిక‌క్కడ జ‌గ‌న్ చెక్ పెట్టేస్తున్నారు. ప్రతిప‌క్ష పార్టీకి బ‌ల‌మైన ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా ఆ పార్టీని డిఫెన్స్‌లో ప‌డేస్తున్నారు. జ‌గ‌న్ ఎక్కడిక‌క్కడ టీడీపీకి బ‌ల‌మైన నాయ‌కుల‌ను దూరం చేయ‌డ‌మో లేదా కీల‌క నేత‌ల‌ను సెట్ చేయ‌డం ద్వారా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ పార్టీకి ఎదురు లేకుండా చేస్తున్నారు. అయితే కీల‌క‌మైన కృష్ణా జిల్లాలోని బెజ‌వాడ ఎంపీ సీటు విష‌యంలో మాత్రం స‌రైన నేత‌ను సెట్ చేయ‌లేక‌పోతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో జిల్లాలో వైసీపీ మూడు చోట్లే ఓడింది. తూర్పులో గ‌ద్దె రామ్మోహ‌న్‌, గ‌న్నవ‌రంలో వంశీ టీడీపీ నుంచి గెల‌వ‌గా.. బెజ‌వాడ ఎంపీగా కేశినేని నాని రెండోసారి విజ‌యం సాధించారు. ఈ మూడు చోట్లలో గ‌న్నవ‌రం, విజ‌య‌వాడ తూర్పులో టీడీపీకి చాలా సులువుగానే జ‌గ‌న్ చెక్ పెట్టేశారు. గ‌న్నవ‌రంలో వంశీ వైసీపీ చెంత చేరిపోయిన‌ట్టే. ఇక తూర్పులో టీడీపీలో ఉన్న యువ‌నేత అవినాష్‌కు వైసీపీ కండువా క‌ప్పేసి పార్టీ బాధ్యత‌లు ఇచ్చేశారు. ఈ రెండు చోట్లా టీడీపీ డీలా ప‌డిపోయింది. జ‌గ‌న్ ఆప‌రేష‌న్ స‌క్సెస్ అయిపోయింది. ఇక జిల్లాలో మిగిలింది ఒక్క బెజ‌వాడ ఎంపీ సీటు మాత్రమే. అక్క‌డ కేశినేని స్ట్రాంగ్‌గానే ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో స్వల్ప మెజార్టీతో రెండోసారి విజ‌యం సాధించిన నానికి ప్రజ‌ల్లో కొద్దో గొప్పో సొంత ఇమేజ్ ఉన్న విష‌యాన్ని కొట్టిప‌డేయ‌లేం. అయితే నాని ఇటీవ‌ల సొంత పార్టీ నేత‌ల‌కే యాంటీ అయ్యారు. అటు పార్టీ అధిష్టానం సైతం నాని విష‌యంలో ఇప్పట్లో ఏం చేయ‌లేక క‌క్కలేక మింగ‌లేక అన్న చందంగా ఉంది.ఇదే స‌మ‌యంలో విజ‌య‌వాడ‌లో వైసీపీ మ‌రింత స్ట్రాంగ్ అయ్యింది. ఇటీవ‌ల కార్పోరేష‌న్ ఎన్నిక‌ల్లోనూ ఆ పార్టీ తిరుగులేని విజ‌యం సాధించింది. ఇప్పుడు ఇక్కడ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంపీ సీటు టార్గెట్‌గా బ‌ల‌మైన నేత‌ను రంగంలోకి దించ‌డ‌మే జ‌గ‌న్ ముందున్న టార్గెట్ ? గ‌త ఎన్నిక‌ల్లో చివ‌రి క్షణంలో వైసీపీ తర‌పున పోటీ చేసిన పొట్లూరి వరప్రసాద్ (పి‌వి‌పి) ఓటమి పాలయ్యారు. ఓడిపోయాక పీవీపీ గుర్తొచ్చిన‌ప్పుడ‌ల్లా సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడం మిన‌హా రాజ‌కీయంగా యాక్టివ్‌గా ఉండ‌డం లేదు. దీంతో పార్లమెంట్ స్థానంలో వైసీపీకి కొత్త నాయకుడు ఉంటే బాగుంటుందనే అభిప్రాయం ఆ పార్టీ శ్రేణుల్లో వస్తుంది.అది కూడా ఎన్నిక‌ల‌కు ముందు హ‌డావిడిగా కాకుండా… ఇప్పుడే స‌రైన నేత‌ను రంగంలోకి దించాల‌ని అంటున్నారు. కేశినేని నాని ఇప్ప‌టికే వ‌రుస‌గా రెండు సార్లు గెలిచి బ‌లంగా ఉన్నారు. ఏదేలా ఉన్నా ఆయ‌న వ్యక్తిగ‌త ఛ‌రిష్మాను ఢీకొట్టే స్థాయిలో ఇక్కడ పార్లమెంటుకు స‌రైన నేత‌ను ముందుగా రంగంలోకి దింపాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పార్టీ నేత‌లు అభిప్రాయ ప‌డుతున్నాయి. అయితే జ‌గ‌న్ ఈ సారి ఇక్కడ సామాజిక స‌మీక‌ర‌ణ‌ల ప‌రంగా ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎవ‌రిని రంగంలోకి దించుతారో ? చూడాలి.

Related Posts