YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ప్రాంతీయ పార్టీలతో కమిటీలు

ప్రాంతీయ పార్టీలతో కమిటీలు

దేశ రాజకీయాల లో గుణాత్మక మార్పు కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నం కి మంచి ఆదరణ లభిస్తోంది...ఇప్పటికే సీఎం థర్డ్ ఫ్రంట్ పై ఒక క్లారిటీ తో ఉన్నా నేపధ్యం లో...కేసీఆర్ ఇంకా ఎవరెవరిని కలవనున్నారు...ఫ్రంట్ కు ఎన్ని రోజులా సమయం  పడుతుంది...ఏమైనా కమిటీలను ఏఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్లాలి అనుకుంటున్నారా...అంటే ఔననే సమాధానమే వస్తోంది.దేశ రాజకీయాలలో గుణాత్మక మార్పు కోసం సీఎం కేసీఆర్ మరో ముందడుగులో భాగంగా చెన్నై లో చాలా విషయాల పై స్పష్టత ఇచ్చారు..ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తో తో కలిసి పనిచేశానని చంద్రశేఖర్ రావు గుర్తు చేశారు. కూటమి ఏర్పాటుపైన చంద్రబాబుతో కలిసి మాట్లాడుతానని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అయితే ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నట్లు తానెప్పుడు చెప్పలేదని, మీడియాలో మాత్రమే ప్రచారం జరుగుతోంది ఆయన చెన్నైలో వ్యాఖ్యానించారు. ఎవరితో కలిసి పనిచేస్తామన్నది భవిష్యత్తు నిర్ణయిస్తుందని కేసీఆర్ స్పష్టం చేశారు.ప్రాంతీయ పార్టీలతో మూడు నెలలలో చర్చలు జరిపి ఒక కో-ఆర్డిననేషన్ కమిటీని ఏఏర్పాటు ఏర్పాటు చేసేలా సీఎం ఆలోచన చేస్తున్నట్లు టీఆర్‌ ఎస్ వర్గాలుఅంటున్నారు...థర్డ్ ఫ్రంట్ లో అన్ని రాష్ట్రాల లో ఉన్నా నాయకులను కలుపుకుపోయేలా కమిటీని వేయనున్నారు....ఇప్పటికే సీఎం కేసీఆర్ అందరిని ఒక తాటి పైకి తేవడానికి చేస్తున్నా ప్రయత్నం లో భాగంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ని, మాజీ ప్రధాని దేవగౌడ ని,చెన్నై లో కరుణానిధి, స్టాలిన్,కనిమొళి ని కలిచారు....ఇదే బాటలో మే 2వ తేదీన అఖిలేష్ యాదవ్ హైద్రాబాద్ లో సీఎం కేసీఆర్ తో చర్చించనున్నారు...వారితో పాటు ఓడిశా తో పాటు,ఇంకా 5 రాష్ట్ర లలో సీఎం పర్యటించనున్నారు అన్న గుసగుసలు పార్టీలో వినపిస్తున్నాయి.దేశాన్ని సుభిక్షంగా మార్చే ప్రభుత్వాలు ఏర్పాటు కావాలన్నదే తన ప్రయత్నమని అయన స్పష్టం చేశారు. ఫెడరల్ ఫ్రంట్ లో ధక్షిణాది రాష్ట్రాలు కలిసి రావాలని కేసీఆర్ కోరారు. కేంద్ర ప్రభుత్వాలు సమస్యలను పరిష్కరించడంలో విఫలమౌతున్నాయని తెలంగాణ సీఎం పేర్కొన్నారు. రాష్ట్రాలపైన కేంద్ర పెత్తనం పోవాల్సిందేనని కేసీఆర్ తేల్చి చెప్పారు. కేంద్రం విదేశీ వ్యవహారాలు, రక్షణ మీదే ద్రుష్టి సారించాలని ఆయన సూచించారు. భారత దేశం నిజమైన సమాఖ్య దేశంగా మారాలని కేసీఆర్ ఆకాంక్షించారు. థర్డ్ ఫ్రంట్ కు ప్రాంతీయ పార్టీలు ఒక తటిపైకి తీసుకువచ్చేలా చూస్తున్నాం అని స్పష్టం చేశారు..

Related Posts