YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

లాలు తో రాహుల్ భేటీ

లాలు తో రాహుల్ భేటీ

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్‌ను కలిశారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన్ను పరామర్శించి... ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. లాలూతో కాసేపు మాట్లాడి... వెంటనే అక్కడి నుంచి వచ్చేశారు. వీరిద్దరి భేటీపై ఊహాగానాలు వినిపిస్తుండగా... దీనికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని... రాహుల్ లాలూను మార్యదపూర్వకంగానే కలిశారని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. దాణా కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్ శిక్ష అనుభవిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం తీవ్ర అస్వస్థతతో ఆయన రాంచీలోని రిమ్స్‌లో చేరారు. కాని అక్కడ సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో... అక్కడి డాక్టర్లు ఢిల్లీ ఎయిమ్స్‌కు రిఫర్ చేశారు. ఆయన గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయనకు... డాక్టర్ నవీత్ విగ్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యులతో కూడిన డాక్టర్ల బృందం వైద్యాన్ని అందిస్తోంది. అనారోగ్యానికి గురైన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందించిన సంగతి తెలిసిందే. ఈరోజు ఆయనను ఎయిమ్స్ వైద్యులు డిశ్చార్జ్ చేశారు. దీంతో, ఆయన ఆసుపత్రి నుంచి రాంచీ ఆసుపత్రికి బయలుదేరారు.  తనకు చికిత్స పూర్తి కాకుండానే బలవంతంగా పంపించారని మండిపడ్డారు. తన ఆరోగ్యాన్ని క్షీణింపజేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎలాంటి వైద్య సౌకర్యాలు లేని చోటుకు తనను బలవంతంగా తరలిస్తున్నారని విమర్శించారు. ఇది చాలా గడ్డు సమయమని... అయినా, తాను ధైర్యంగా ఎదుర్కొంటానని అన్నారు.మరోవైపు, లాలూ ఆరోగ్యం మెరుగుపడిందని, ప్రయాణం చేసే శక్తి ఆయనకు ఉందని ఎయిమ్స్ వైద్యులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆయనను రాంచీలోని రాంచీ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి రెఫర్ చేస్తున్నామని చెప్పారు. మెడికల్ బోర్డు సలహా మేరకు ఆయనను డిశ్చార్జ్ చేశామని తెలిపారు. ఈ డిశ్చార్జ్ వ్యవహారం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే ఆరోపణలను ఎయిమ్స్ వైద్యులు ఖండించారు. 

Related Posts