హైదరాబాద్ :జూన్ 3
తొలివెలుగు యాంకర్, జర్నలిస్ట్ రఘును వెంటనే విడుదల చేయాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ డిమాండ్ చేసింది. ప్రశ్నించే గొంతు నొక్కే ఈ విధంగా కొన్ని అసాంఘిక శక్తులు పాల్పడుతూ భయభ్రాంతులకు సృష్టిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. గురువారం ఉదయం యాంకర్ రఘును కొంతమంది గుర్తు తెలియని దుండగులు జీపులో బలవంతంగా ఎక్కించుకుని కిడ్నాప్ చేయడం హేయమైన చర్యగా యూటీ జె నేతలు అశోక్ రెడ్డి, అమర్, సతీష్ కమాల్, గోపి యాదవ్, రమేష్, చంద్రమోహన్, నరసింహారావు, విజయ్ కుమార్ ,వెంకట్ రెడ్డి జి. విద్యాసాగర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, ఆంజనేయులు, సత్యం, సంపత్ లు ధ్వజ మెత్తారు. యాంకర్ రఘు కిడ్నాప్ ను యు టి జే నేతలు తీవ్రంగా ఖండించారు. కిడ్నాప్ చేసిన నిందితులను గుర్తించి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో జర్నలిస్టుల స్వేచ్ఛ వాక్ స్వాతంత్ర్యాలు పూర్తిగా నిర్బంధించ పడుతున్నాయని ఆక్షేపించారు. ఇలాంటి పరిస్థితుల్లో జర్నలిస్టు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అవినీతి అక్రమాలను బయట పెట్టకుండా భయపడి పోతారని అసాంఘిక శక్తులు భావించడం సరికాదని అన్నారు. ఇటీవల కాలంలో రఘు అన్యాక్రాంతమై పోతున్నా ప్రభుత్వ భూముల విషయమై క్షేత్రస్థాయిలో కి వెళ్లి రిపోర్టు చేస్తున్న సమయంలో ఇలాంటి కిడ్నాపింగ్ కు పాల్పడడం సహించరాని వారన్నారు. ప్రభుత్వం స్పందించి కిడ్నాప్కు గురైన రఘును విడిపించాలని డిమాండ్ చేశారు.
* కిడ్నాప్ జరిగింది ఇలా
తొలి వెలుగు యాంకర్ రఘును 9గంటల ప్రాంతంలో మల్కాజిగిరిలోని ఆయన నివాసానికి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. నెంబర్ ప్లేట్ లేని జీపులో... తలకు ముసుగు కప్పి, చేతులు కట్టి బలవంతంగా రఘును తీసుకెళ్లారు. "కోకాపేట కాందిశీకుల భూమి, ఐకియా ముందున్న భూమి, ఐడిపిల్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లపై కథనాలను ప్రసారం చేస్తే.. ఖబడ్దార్" అంటూ దుండగులు పెద్దపెట్టున కేకలు వేస్తూ జర్నలిస్ట్ రఘును బలవంతంగా జీపు లో బలవంతంగా తీసుకొని వెళ్ళిపోయారు కిడ్నాప్ చేసే సమయంలో ఓ రఘు ముఖానికి ముసుగు కప్పి తీసుకు వెళ్లి పోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.