నెల్లూరు, బి జె పి నేతల స్థలం లో రాత్రికి రాత్రే వెలసిన వైకాపా కార్యాలయం పోలీసుల తీరుకు నివ్వెర పోతున్న బీజేపీ నేతలు
బిజెపి నేతల స్థలంలో రాత్రికి రాత్రే, రంగులద్ది ఓ పాప కార్యాలయంగా మార్చిన ఘటన స్థానిక బివి నగర్ ప్రాంతంలో ఎదురయ్యింది. స్థానికుల వివరాల మేరకు నెల్లూరు నగరం, వనంతోపు సెంటర్ వద్ద ఒక మార్చుల్ స్తలం 3 సంవత్సరాలుగా, జిల్లా న్యాయ స్థానంలో విచారణ జరుగుతుంది. ఈ క్రమంలో లోక్ అదాలతోలో ఇరు వర్గాల వాదనలు, సంబంధిత పత్రాలు పరిశీలించి, బిజిపి దళిత నేతలు మేలింగి మధు సూదనరావు, కట్టా వెంకట రమణ లకు అనుకూలంగా కోర్టు అవార్డు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈ స్తలాన్ని ఎలాగైనా ఆక్రమించాలని కుట్రపన్నిన వైకాపా నేతలు రాత్రికి రాత్రే రంగులు వేసి వైసిపి పార్టీ కార్యాలయం బోర్డు తగిలించారు. విషయం తెలుసుకుని ఆ సంఘటనా స్థలాన్ని చూసేందుకు వెళ్లిన బిజిపి నేతల పై ముందస్తు ప్రణాళిక ప్రకారం ,వేదాయ పాలెం పోలీసు స్టేషన్ ఎస్ ఐ రంగ ప్రవేశం చేసి, కబ్జాదారులదే కరెక్టు - కోర్టు ఆర్డర్ లతో నాకు పని లేదని ఏకపక్షంగా ఎవరి ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎస్సై ఏకపక్ష తీర్పుకు నివ్వెరపోయిన బిజెపి నేతలు అనంతరం స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నట్లు సమాచారం.