YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

టార్గెట్ జగన్... ఆర్ ఆర్ ఆర్ అడుగులు

టార్గెట్ జగన్... ఆర్ ఆర్ ఆర్  అడుగులు

న్యూఢిల్లీ, జూన్ 4, 
వైసీపీ రెబల్ ఎంపీరఘు రామకృష్ణ రాజు ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. తనను అరెస్టు చేసి ఇబ్బందులకు గురిచేసిన జగన్ సర్కార్‌కి వ్యతిరేకంగా ఢిల్లీలో పావులు కదుపుతున్నారు. తొలుత కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ని కలిసిన ఆయన తనపై కుట్రపన్నిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కస్టడీలో తనను దారుణంగా కొట్టారని.. తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌కి ఫిర్యాదు చేశారు. నిన్న ఏకంగా లోక్‌సభ స్పీకర్‌ని కలసి అరెస్టు నుంచి బెయిల్ వరకూ జరిగిన పరిణామాలను వివరించారు. స్పందించిన ఆయన విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజద్రోహం కేసులో అరెస్టు, సీఐడీ అధికారులు కొట్టారని ఆరోపిస్తున్న రఘురామ విషయం సీరియస్‌గా తీసుకున్నారు. తనకు ఉన్న ఏ అవకాశాన్నీ ఆయన వదులుకోకుండా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మద్దతు కూడగట్టు ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా లోక్‌సభ స్టాండింగ్ కమిటీకి లేఖ రాశారు. స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్న రఘురామ కమిటీలో సభ్యులుగా ఉన్న సహచర ఎంపీలకు లేఖలు రాసినట్లు తెలుస్తోంది. పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ లా అండ్ జస్టిస్ స్టాండింగ్ కమిటీకి లేఖ రాసిన ఆయన.. తనపై జరిగిన దాడి గురించి వివరంగా తెలియజేశారు. తన కాళ్ల ఫొటోలను కూడా జతపరిచి లేఖ పంపినట్లు తెలుస్తోంది. పార్టీలకు అతీతంగా తనకు మద్దతుగా నిలవాలని ఎంపీలను కోరారు.ఈ వ్యవహారంపై సహచర ఎంపీలు కూడా తీవ్రంగానే స్పందించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నేత మాణిక్కం ఠాగూర్ ఘాటుగా స్పందించారు. ఎంపీ రఘురామను క్రూరంగా కొట్టడం ఏపీ పోలీసుల దాష్టీకానికి నిదర్శనమన్నారు. సిద్ధాంతపరంగా రఘురామతో విభేదించినప్పటికీ సహచర ఎంపీకి ఇలా జరగడాన్ని తీవ్రంగా ఖండించారు. ఒక ఎంపీకే ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితేంటని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రాలో హిట్లర్ రాజ్యం నడుస్తోందంటూ ఘాటు ట్వీట్ చేశారు. రఘురామ లేఖ చూసి పలువురు ఎంపీలు షాకైనట్లు తెలుస్తోంది.

Related Posts