న్యూఢిల్లీ
ఎంపీ రఘురామకృష్ణరాజు ఎంపీలందరికి కు లేఖ రాశారు. తన అరెస్ట్ తదనంతర పరిణామాలను వివరిస్తూ ఆయన లేఖ రాశారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో పార్టీలకు అతీతంగా తనకు మద్దతివ్వాలని లేఖలో కోరారు. దేశంలో తొలిసారి ఓ ఎంపీపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని తెలిపారు. అయితే ఎంపీ రఘురామ లేఖను చూసి పలువురు ఎంపీలు ఆశ్చర్యానికి గురైనట్లు తెలుస్తోంది. జగన్ ప్రభుత్వానిది హిట్లర్ పాలనగా కాంగ్రెస్ ఎంపీ మానిక్కం ఠాగూర్ అభివర్ణించారు. రఘురామ లేఖను ట్విటర్లో ఠాగూర్ పోస్ట్ చేశారు. రఘురామపై పోలీసుల దాడిని ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందని పలువురు ఎంపీలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఎంపీలకు రాసిన లేఖలపై స్పందించడానికి రఘురామ నిరాకరించారు.