YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆనందయ్య మందు..ఇలా

ఆనందయ్య మందు..ఇలా

హైదరాబాద్, జూన్ 4,
కరోనా నివారణ కోసం నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య.. ఆయుర్వేద మందును తయారు చేసిన విషయం తెలిసిందే. ఈ మందును ఇప్పటికే కొందరు తీసుకోగా.. త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది. అయితే ఈ మందును ఎలా తీసుకోవాలి.? ఎవరు వాడకూడదు.?
కరోనా రాని వారు..
– కరోనా రాని వారు ‘పి’ అనే రకం మందును.. ఉదయాన్నే పరగడపున చింతగింజ సైజులో వేసుకోవాలి.
– మళ్లీ రాత్రి భోజనానికి ముందు చింతగింజ సైజులో వేసుకోవాలి. ( ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనానికి అరగంట ముందు తీసుకోవాలి.
– ఇలా రెండు రోజులు తీసుకోవాలి.
– తిరిగి పది రోజుల తర్వాత ఇదే విధంగా మళ్లీ ఒక్క రోజు మందు వేసుకోవాలి.
కరోనా వచ్చిన వారు..
– ‘పి’ అనే రకం మందును.. ఉదయాన్నే పరగడపున చింతగింజ సైజులో వేసుకోవాలి.
– మళ్లీ రాత్రి భోజనానికి ముందు చింతగింజ సైజులో వేసుకోవాలి. ( ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనానికి అరగంట ముందు తీసుకోవాలి.
– ఇలా మూడు రోజులు తీసుకోవాలి.
– ‘ఎఫ్’ అనే రకం మందును ఉదయాన్నే టిఫిన్‌తో పాటు గోలీ సైజులో వేసుకోవాలి. ( పి రకం మందు తీసుకున్న 30 నిమిషాల తర్వాత వేసుకోవాలి.
– ఇలా ఎఫ్ రకం మందును 2 రోజులు తీసుకోవాలి.
– ‘ఎల్ ’ అనే రకం మందును భోజనం ముందు గోలీ సైజులో వేసుకోవాలి. ( ‘ఎఫ్’ రకం మందు తీసుకున్న 3 గంటల తర్వాత ఇది వేసుకోవాలి).
– ఇలా మూడు రోజులు తీసుకోవాలి.
 కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటే.. ఎఫ్, ఎల్  మూడవ రోజు కూడా తీసుకోవచ్చు.
ఆక్సీజన్ లెవల్స్ తగ్గిన వారికి కంటి చుక్కల మందు.. (అయితే..ఇప్పుడు రెడీగా లేదు)
– ‘ఐ’ అనే రకం మందు రెండు కళ్లలో ఒక్క చుక్క చొప్పున వేసుకుని 5 నిమిషాలు వెయిట్ చేయాలి.
– ఒకవేళ కళ్లు మంటలు రాకపోతే పైన తెలిపిన విధంగా 2 సార్లు 15 నిమిషాల వ్యవధిలో వేయవలెను.
ముఖ్య గమనిక..
– మందు తీసుకున్నాక మాంసాహారం తినరాదు.
– గర్భిణీలు వాడరాదు.
– మహిళలు రుతు క్రమం సమయంలో వాడరాదు.
– మందును ఫ్రిజ్‌లో ఉంచకూడదు.
– ఆకలి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి.
– రోజులో 5 లీటర్లు తక్కువ కాకుండా నీరు తీసుకోవాలి.

Related Posts