YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త లొల్లి

తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త లొల్లి

తెలంగాణ కాంగ్రేస్ లో .దాగుడుమూతల చేరికలు  మరోసారి వివాదమవుతోంది. పాలమూరు కాంగ్రేస్  సీనియర్లను సంప్రదించకుండా పిసిసి  చేరికలు చేయడంతో...ఓ వర్గం ఆగ్రహంతో ఊగిపోతుంది.దింతో అధిష్టానంతో మరోసారి తేల్చుకోవడానికి సన్నదమవుతున్నారు.పీసిసి, పార్టీ ఇంచార్జ్ దాగుడు మూతల చేరికల పై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ కాంగ్రేస్ లో చేరికల పై వివాదం రాజుకుంటోంది. గతంలో పాలమూరు నేతల జాయినింగ్ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో అనేక అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. టిడిపి నుంచి రేవంత్ రెడ్డి చేరక సమయంలో పార్టీతోపాటు  పాలమూరు సీనియర్ల తో చర్చించకుండా పిసిసి  రేవంత్ ను చేర్పించుకోవడం నాడు వారికి రుచించని సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ అదే సీన్ రిపీట్ అవ్వడంతో నేతలు అగ్గిమీదగుగ్గిలం అవుతున్నారుఇక తాజగా మళ్లీ అదే వివాదం తెరపైకి వచ్చింది. మాజిమంత్రి బిజేపి సినియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రేస్ లో చేరిక పై కూడ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పాలమూరుజిల్లాల్లో మాజిమంత్రి డికే అరుణ వర్గం నాగం చేరికను మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తూన్న విషయం తెల్సిందే. కనీసం పార్టీలో చేర్చుకునే ముందు జిల్లా నేతలతో చర్చించి పార్టీ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. కానీ నాగం పార్టీలో చేరికకు ముందు జిల్లా నేతలతో చర్చించకుండానే  నేరుగా ఏఐసిసి అధినేత రాహుల్ గాంధి వద్ద చేర్పించడం డికే వర్గానికి రుచించడం లేదు.ఐతే ఇటీవల మాజి మంత్రి డికే  పార్టీ ఇంచార్జ్ కుంతియను నిలదీసినట్లు తెలుస్తోంది. నాగం చేరికకు ముందు తనతో ఎందుకు చర్చించలేదని ఆమే మండిపడ్డట్టు సమాచారం.ఐతే అందరికి తెలియచేస్తుంన్నం..మీతో పీసీసీ చర్చిస్తారని చెప్పడంతోనే నాగం చేరికకు తేది ఖరారు చేసిన్నట్లు కుంతియా సమాదానం ఇచ్చిన్నట్లు తెలుస్తోంది.

ఇక పార్టీలోకి ఎవ్వరు వచ్చినా... దొడ్డిదారినే జ్యాయినింగ్ క్యూ అనే ప్రశ్న సీనియర్ నేతల నోటా నుండి చర్చ జోరుగా సాగుతుంది. పార్టీలో చేర్చుకునే ముందు జిల్లా నేతలతో చర్చించకుండా  దాగుడుమూతలాడతూ.. పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరమేమొచ్చిందని పార్టీనేతలు ప్రశ్నిస్తున్నారు. పార్టీలో చేర్చుకునే ముందు జిల్లా నేతలతో చర్చించి జిల్లా నేతల ఆద్వర్యంలో పార్టీలో చేర్చుకోవడానికి పిసిసికి అభ్యంతరాలు ఏమిటని అంతర్గంగా చర్చ జరుగుతోంది. తమతో చర్చించడానికి పిసిసికి అభ్యంతరాలు ఎందుకు   ఈ అంశం పై మరోసారి రాహుల్ గాంధికి ఫిర్యాదు చేయడానికి పాలమూరు నేతలు సిద్దమవుతున్నట్లు సమాచారం..మొత్తానికి పాలమూరు పంచాయితీ... పరిష్కారం అయ్యేలా కనిపించడం లేదు. పిసిసి వివాదానికి తెర వేయడం కంటే  సైలెంటుగా  ఉన్న వారిని రెచ్చగొట్టి  కొత్త వివాదం సృష్టిస్తున్నారనే ప్రచారం ఉంది.ఐతే ఈ వివాదానికి హస్తం పార్టీ ఎలాంటి ముగింపు ఇస్తుందో అనే ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది.

Related Posts