YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

2024 జగన్ అడుగులు

2024 జగన్ అడుగులు

విజయవాడ, జూన్ 4, 
వైసీపీలో కొంద‌రు నేత‌ల‌ను ప‌క్కన పెడ‌తారా ? వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి వ్యూహం మారిపోతుందా ? 2024 ఎన్నికల నాటికి జ‌గ‌న్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారా ? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజ‌కీయ ప‌రిణామాలు.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పూర్తిగా మారిపోవ‌డం ఖాయ‌మని అంటున్నారు. అంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి రాష్ట్ర బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన‌ల‌తో మ‌హాకూట‌మి ఏర్పడే అవ‌కాశం ఉంద‌ని పెద్ద ఎత్తున ప్రచారం జ‌రుగుతోంది. సో.. నెక్ట్స్ ఎన్నిక‌ల్లో ఫైట్ భీక‌రంగా ఉంటుంద‌ని తెలుస్తోంది.ఈ ఫైట్‌ను కూడా త‌ట్టుకుని.. మ‌ళ్లీ అధికారం ద‌క్కించుకోవాలంటే.. వైసీపీ మ‌రింత ప‌దునుగా వ్యవ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఉంటుంది. ప్రజ‌ల నాడిని తెలుసుకున్న నాయ‌కుల‌కు మాత్రం టికెట్లు ఇవ్వాల్సిన అవ‌స‌రం కూడా ఉంటుంది. అదే స‌మ‌యంలో పార్టీని పుంజుకునేందుకు వ్యూహాత్మకంగా అడ‌గులు వేసే నాయ‌కుల‌కు మాత్రమే అవ‌కాశం ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో వైసీపీలో ఇప్పుడున్న నేత‌ల‌కు చెక్ పెడతార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ వ‌రుస‌లో చాలా మంది సీనియ‌ర్లు, వ‌యోవృద్ధులు.. వివాదాస్పద ఎమ్మెల్యేలు కూడా ఉన్నార‌ని చెబుతున్నారు.వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి జ‌గ‌న్‌కు ఉన్న పెద్ద ల‌క్ష్యం.. పార్టీని అధికారంలోకి తీసుకురావ‌డం. ప‌రిస్థితి ఎలా ఉన్నా.. ఎన్నిపార్టీలు కూట‌మిక‌ట్టినా.. ఆయ‌న నెగ్గాలి. ఈ క్రమంలోనే ఆయ‌న ఇప్పుడున్న వారిలో తాలు-త‌ప్పల‌ను ఏరేయ‌నున్నార‌నే ప్రచారం సాగుతోంది. వీరిలో ప‌లు పేర్లు వినిపిస్తున్నాయి. ఈ లిస్టులో వినిపిస్తోన్న కొన్ని పేర్లలో గూడురు వైసీపీ ఎమ్మెల్యే వెల‌గ‌పూడి వ‌ర‌ప్రసాద్‌, వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, ఆముదాల వ‌ల‌స ఎమ్మెల్యే త‌మ్మినేని సీతారాం, స‌త్తెన ప‌ల్లి ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు, తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగ‌డ్డ ర‌క్షణ‌నిధి, నూజివీడు అప్పారావు, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, మంత్రులు చెరుకువాడ శ్రీ రంగ‌నాథ‌రాజు, శంక‌ర‌నారాయ‌ణ‌, గుమ్మనూరు జ‌య‌రాం స‌హా చాలా మంది ఈ వ‌రుస‌లో ఉన్నార‌ని తెలుస్తోంది.వీరి స్థానంలో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో కొత్తవారికి అవ‌కాశం ఇచ్చే సూచ‌న‌లు మెండుగా క‌నిపిస్తున్నాయి. ఇక‌, అదే స‌మ‌యంలో గ‌త ఎన్నిక‌ల్లో కొత్త‌గా రాజ‌కీయాల్లోకి వ‌చ్చి.. ఎన్నికైన వారిపైనా జ‌గ‌న్ అధ్యయ‌నం చేస్తున్నార‌ని, ప్రజ‌ల‌కు చేరువ కాని నేత‌ల‌ను ప‌క్కన పెట్టాల‌ని భావిస్తున్నార‌ని అంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ప‌లువురు యువ ఎమ్మెల్యేలు చాలా మందే ఉన్న‌ట్టు వైసీపీ వ‌ర్గాల టాక్ ? మ‌రి ఎవ‌రి త‌ల‌రాత‌లు మార‌తాయో చూడాలి.

Related Posts