YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే సభ్యత్వానికి ఈటల రాజీనామా

టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే సభ్యత్వానికి ఈటల రాజీనామా

హైదరాబాద్ జూన్ 4

* ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక నియంత
*  మంత్రులను ఎమ్మెల్యేలను కూడా కలవడు
* ఆయన తెలంగాణకు పట్టిన శని
* నాతో పాటు హరీష్ రావు అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు
* ఒకప్పుడు ప్రజల నమ్ముకుంటే.. ఇప్పుడు డబ్బులు నమ్ముకున్నారు
* బెంజ్‌ కార్లలో తిరిగేవాళ్లకు కూడా రైతు బంధు ఇస్తున్నారు
* వందల మంది బలిదానం చేస్తే రాష్ట్రం వచ్చింది * అందర్ వాలే బాహర్, బాహర్ వాలే అందర్ అన్నట్లుగా ఉంది’’
* నక్సలైట్ అజెండా అని చెప్పిన మీరు వరవరరావును జైల్‌లో పెడితే ఎందుకు మాట్లాడలేదు?
* ప్రగతి భవన్‌ కాదు.. బానిసల నిలయం
* కుట్రలు, కుతంత్రాలతో తాత్కాలికంగా విజయం సాధించొచ్చు
* ఎంవోలో ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ అధికారైనా ఉన్నారా?
* ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక్కడే ఆర్థికంగా ఉండాలని కోరుకుంటున్నారు
* రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా..ఎమ్మెల్యేలను డబ్బులు పెట్టి కొనుగోలు చేశారు
* తెలంగాణలో కుటుంబ పాలన కెసిఆర్ నియంతృత్వానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే
* మీడియా సమావేశం లో మాజీ మంత్రి ఈటల సంచలన వ్యాఖ్యలు
మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. నేడు మీడియా సమావేశం లో ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఈటల పలు ఆసక్తికర, సంచలన విషయాలు చెప్పుకొచ్చారు.  ‘‘ అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా నాపై చర్యలు తీసుకున్నారు. రాత్రికి రాత్రే కేబినెట్‌ నుంచి నన్ను బర్తరఫ్‌ చేశారు. ఉరిశిక్ష పడ్డ ఖైదీని కూడా చివరి కోరిక ఏంటని అడుగుతారు. కనీసం నా వివరణ కూడా తీసుకోకుండా చర్యలు తీసుకున్నారు. నా అనుచరులను బెదిరింపులకు గురిచేసినా తట్టుకొని నిలబడ్డారు. నాపై జరుగుతోన్న కుట్రలు, కుతంత్రాలను ప్రజలు గమనిస్తున్నారు. నాకు హుజురాబాద్‌ ప్రజలు ధైర్యం చెబుతున్నారు. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నా’’ అని ప్రకటించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక నియంత మంత్రులను ఎమ్మెల్యేలను కూడా కలవడు ఆయన తెలంగాణకు పట్టిన శని సమైక్య పాలనలో పాలకులు కేసీఆర్ వ్యవహరిస్తే తెలంగాణ వచ్చి ఉండేది కాదని ఈటెల రాజేందర్ అన్నారు.
ఎన్నిసార్లు అవమానాల పాలు చేసిన భరించాను టిఆర్ఎస్ పార్టీ నీ అబ్బ సొత్తు కాదు ఎంతో మంది వీరుల బలిదానం కెసిఆర్ నీ గుట్టు విప్పుతా ప్రజల్లో నిన్ను దోషిగా నిలబడతా నేను నీ బానిసను కాను  గుర్తుంచుకో.. మంత్రివర్గం నుండి తనను బర్తరఫ్ చేయడం హుజరాబాద్ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు ప్రతి కుటుంబ సభ్యులు ఏదో కోల్పోయామనే బాధలో ఉన్నారని ఆయన చెప్పారు తాను విలువలకోసం జీవిస్తున్నాను నియోజక ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు అవమానించిన చోట ఉండటం భావ్యం కాదని నా ప్రజలు అంటున్నారని దానికి అనుగుణంగానే తాను టిఆర్ఎస్ తో ఉన్న ఇరవై అనుబంధాన్ని ఈ రోజుతో వదులుకున్నానని ఈటెల రాజేందర్ ఆ వేదన తో కూడిన స్వరంతో చెప్పారు.
ఎవరైనా తప్పు చేసినప్పుడు లేదా ఆరోపణలు వచ్చినప్పుడు వారి నుంచి సంజాయిషీ అడుగుతారని నిజానిజాలు నిర్ధారణ చేసుకుంటారని ని కానీ అది లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని ఈటెల రాజేందర్ ధ్వజ మెత్తారు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో లో జరిగిన ఉప ఎన్నికల్లో లో పట్టు మంటే పదిమంది కూడా గెలవలేదని గెలిచిన దాంట్లో  తాను ఒకడిని అని ఆయన అన్నారు ఇదే విషయాన్ని అప్పట్లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీ లో బయట  పదే పదే ఆ మాట అనే వాడిని ఈటెల గుర్తు చేశారు ఆయన అన్న  మాటకు తానేమీ బాధపడ లేదని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై తన లక్ష్యమని దాని కోసమే తాను ధైర్యంగా నిలబడ్డారని ఈటల అన్నారు ఒకప్పుడు ప్రజల నమ్ముకున్న తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు డబ్బులు నమ్ముకుంటే ఉందని ఇదే విషయం యం పి టీ వల్ల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బట్టబయలైంది అని ఈటెల అన్నారు.
 ‘‘సంక్షేమ పథకాలను ఏనాడు వ్యతిరేకించలేదు. వందల కోట్లు ఇన్కమ్ టాక్స్ కట్టేవాళ్లకు రైతు బంధు ఇవ్వొద్దని చెప్పిన. అది చెప్పడం తప్పేలా అవుతుంది? బెంజ్‌ కార్లలో తిరిగేవాళ్లకు కూడా రైతు బంధు ఇస్తున్నారు. నయీం లాంటి వ్యక్తులు చంపుతానని బెదిరించినా తెలంగాణ జెండా వదలలే. ఆర్థిక మంత్రిగా టీఎన్జీవోలు నన్ను కలిస్తే అవహేళన చేశారు. తెలంగాణ బొగ్గు గని కార్మిసంఘం నేను పెట్టిస్తే దాన్ని ఇప్పుడు సీఎం కేసీఆర్ కూతురు కవిత నడుపుతోంది. ఆర్టీసీ కార్మిక సంఘాన్ని నేను, హరీష్ రావు పెట్టిస్తే.. కవితకు అప్పగిస్తున్నారు. ఏ సంఘానికీ ఈ రోజు హక్కులు లేవు. ధర్నా చౌక్ కూడా లేదు. ఇవి మేము అడుగొద్దా? పెన్షన్‌లు సీఎంకు చెప్పి ఇప్పిస్తా అని చెప్పడం తప్పా? ఐకేపీ సెంటర్లు ఉంటాయ్.. ధాన్యం కొంటాయ్ అని చెప్పడం తప్పా? రోషం గల బిడ్డను కాబట్టే ఆనాడు టీఆర్ఎస్‌లో చేరినా. మంత్రి పదవి ఇచ్చి బానిస బతుకు బతకమంటే సాధ్యమా? నీవు లల్లు, మాయావతిలాగా పెట్టిన పార్టీ కాదు. వందల మంది బలిదానం చేస్తే రాష్ట్రం వచ్చింది. అందర్ వాలే బాహర్, బాహర్ వాలే అందర్ అన్నట్లుగా ఉంది’’ అని ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘‘అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డి అసెంబ్లీలో నన్ను అవహేళన చేశారు. పట్టుమని పది సీట్లు గెలవలేదని ఆయన విమర్శించారు. తెలంగాణ ఆత్మగౌరవం మీద దెబ్బకొడితే రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లాం. ప్రలోభాలకు లొంగకుండా ఉద్యమకారులను కరీంనగర్‌ ప్రజలు గెలిపించారు.  అప్పుడు కేసీఆర్‌ ధర్మాన్ని నమ్ముకుంటే.. ఇప్పుడు డబ్బు అణచివేతలను నమ్ముకున్నారు. కుట్రలు, కుతంత్రాలతో తాత్కాలికంగా విజయం సాధించొచ్చు. ఆత్మగౌరవం, బాధ్యతలేని మంత్రి పదవి అవసరం లేదని చెప్పా. ప్రగతి భవన్‌ కాదు.. బానిసల నిలయంగా పెట్టుకోవాలని చెప్పా. నన్ను బొందపెట్టమని ఆదేశాలు అందుకున్న మంత్రి హరీశ్‌రావుకు అవమానం జరిగింది. సీఎంవోలో ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ అధికారైనా ఉన్నారా? ఆర్థిక శాఖ అధికారులతో సమీక్షలో ఆర్థికమంత్రి ఉండరు. దరఖాస్తు అందించి ఫొటో దిగేందుకు కూడా టీఎన్జీవోలకు అనుమతి ఇవ్వలేదు. నల్గొండ, హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు’’ అని ఈటల వ్యాఖ్యానించారు..
 ‘’నిన్ను చంపుతా అన్న వారు వచ్చి మీ పక్కన కూర్చున్నారు. నాకు మస్క కొడితే పదవి ఇవ్వలేదు. ఆలె నరేంద్ర, విజయశాంతిని నాలానే పంపించారు. మంత్రులకు, అధికారులకు స్వేచ్ఛ లేదు. నక్సలైట్ అజెండా అని చెప్పిన మీరు వరవరరావును జైల్‌లో పెడితే ఎందుకు మాట్లాడలేదు? మంత్రుల మీదే నమ్మకం లేకపోతే నాలుగు కోట్ల ప్రజలను అడిగే హక్కు ఎక్కడిది? అప్పటి ఒక దళిత ఎమ్మెల్యే, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే, మహబూబ్ నగర్‌ ఆయనది.. సహాయం అడిగితే చేయొద్దని ఆదేశించారు. ఆ దళిత మాజీ ఎమ్మెల్యే ఎవరో కూడా ఎప్పుడు చెప్పమన్నా చెప్పేందుకు నేను సిద్ధం’’ అని ఈటల పేర్కొన్నారు.
 నాతో పాటు ఆర్థిక మంత్రి హరీష్ రావు అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు ఇవాళ ఆయన విషయం మర్చిపోయిన ఆయన కుటుంబ సభ్యులు మర్చిపోలేదని ఈటెల అన్నారు తాను తనతో పాటు ఒక ఏడు మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కేసీఆర్ ని కలవడానికి ఫార్మ్ హౌస్ వెళ్దామని దాదాపు మూడు దఫాలుగా వెళ్లిన మూడు సార్లు గేటు దగ్గర నుండే పంపించి వేశారని ఇది అంతా కెసిఆర్ తో సఖ్యతగా ఉన్న రోజుల్లోనే తమకు అవమానం జరిగిందని ఇక ప్రగతి భవన్ ల జరిగిన అవమానాలు  కలవడానికి వెళ్తే అన్నీ కావని ఆయన అన్నారు ఇది తన ఒక్కడి జరగలేదని ఒకరిద్దరు మంత్రులు తప్ప మిగతా మంత్రులకు అంతా ఈ అవమానాలు జరిగాయి జరుగుతూనే ఉన్నాయి ఈటల రాజేందర్ అన్నారు ముఖ్యమంత్రి దగ్గర అ అధికారులుగా ఉన్న వారిలో ఏ ఒక్కరు కూడా బలహీన వర్గాలకు చెందిన వారు లేరని ఈటెల మండిపడ్డారుతెలంగాణ ఉద్యమంలో కీలక పత్ర పోషించినఆర్టీసీ కార్మిక సంఘాలను ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్దాక్షిణ్యంగా రద్దు చేశారని ఈ విషయాన్ని మంత్రి గా ఉంటూ కూడా ముఖ్యమంత్రి వద్ద వ్యతిరేకించారని ఆయన కూడా ఆయన చీమ కుట్టినట్లు కూడా వ్యవహరించలేదని ఈటెల రాజేందర్ ధ్వజమెత్తారు. సంక్షేమ పథకాలు అమలు చేయవలసదే కానీ లక్ష లక్షలకు ఇన్కమ్ టాక్స్ కట్టే వారికి ఎందుకు రైతుబంధు ఇస్తున్నారని తాను ప్రశ్నించాలని ఆయన గుర్తు చేశారు తెలంగాణ రాష్ట్ర సమితి కుటుంబ పార్టీ కాదని ఎంతో మంది వీరుల త్యాగ ఫలితం వలన తెలంగాణ వచ్చిందని ఆయన గుర్తు చేశారు తెలంగాణ కోసం త్యాగం చేసిన ఎంతో మంది నాయకులను వరుసగా పార్టీ నుంచి బయటికి గెంటివేశాడు అని చివరకు కు తెలంగాణ సాధన లో ముఖ్య భూమిక పోషించిన ప్రొఫెసర్ కోదండరామ్ ఎన్నో విధాలుగా అవమానించారని ఈటెల ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్ అహంకార ధోరణి తాను మంత్రిగా ఉండగానే పలుమార్లు తన మనోభావాన్ని పలు సందర్భాల్లో వ్యక్తం చేశారని ఆయన గుర్తు చేశారు కొన్ని సందర్భాల్లో సమైక్య రాష్ట్రంలో తాను ఉద్యోగం నుంచి తప్పుకుంటే కొన్ని వేల కోట్ల రూపాయల ఆఫర్ చేశారని కానీ దాని తృణప్రాయంగా వ్యతిరేకించాలని డబ్బుల కంటే తెలంగాణ రాష్ట్ర సాధనే తమ ధ్యేయమని స్పష్టంగా వారి చెప్పానని చెప్పారు నిజంగా డబ్బులు సంపాదించాలి అనుకుంటే ఆనాడే డబ్బులు తీసుకొని తాను ప్రశాంతమైన జీవితం గడిపేవాడిని ఈటెల అన్నారు తాను సమైక్య రాష్ట్రంలో గోడౌన్ల నిర్మాణానికి అనుమతి తెచ్చుకున్నానని కానీ ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కూల్చి వేసిందని  ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక్కడే ఆర్థికంగా ఉండాలని కోరుకుంటున్నారని మిగతావాళ్లంతా ఆర్థిక పరిస్థితి బాగాలేక బానిస లాగా బ్రతికి ఉండాలనే కోరుకుంటానని ఈటెల అన్నారు రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేశారని ఎమ్మెల్యేలను డబ్బులు పెట్టి కొనుగోలు చేశారని దీనిక తన వద్ద ఆధారాలున్నాయని ఈటెల అన్నారు తెలంగాణలో కుటుంబ పాలన సాగదు కెసిఆర్ నియంతృత్వానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే నాతో కలిసి వచ్చే ప్రతి వారిని నేను కలుపుకొని వెళ్తాను నేను బానిసని కాదు బానిసత్వాన్ని వ్యతిరేకిస్తాను హుజూర్నగర్ లో ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా అవలీలగా విజయం సాధిస్తాం తాను బిజెపి చేరడానికి కొన్ని కారణాలు ఉన్నాయి వాటిని త్వరలో వివరిస్తాను అని ఈటెల అన్నారు.

Related Posts