వాషింగ్టన్ జూన్ 4
కరోనా సెకండ్ వేవ్ భారత్‌ను వణికించిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పడుతుండడం కాస్తా ఊరటనిచ్చే విషయం. ఇదిలాఉంటే.. భారత్లో కరోనా కట్టడిపై అగ్రరాజ్యం అమెరికా తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. సాధ్యమైనంత త్వరగా కొవిడ్-19 వ్యాక్సిన్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచితే మహమ్మారిని కట్టడి చేసే అవకాశం ఉందని యూఎస్ అభిప్రాయపడింది. భారత్లో కరోనా కట్టడికి టీకాల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం ఒక్కటే మార్గమని, అదే గేమ్ఛేంజర్ కూడా కావొచ్చని పేర్కొంది. అమెరికా విదేశాంగ ప్రతినిధి నెడ్ ప్రైస్ మాట్లాడుతూ.. "కరోనా విజృంభణ భారత్పై తీవ్ర ప్రభావం చూపింది. ఇండియా అణువణువును మహమ్మారి వణికించింది. ఈ సమయంలో భారత్‌లో వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచితే వైరస్ కట్టడిలో అది గేమ్ఛేంజర్గా మారే అవకాశముంది" అని అన్నారు.ఈ సందర్భంగా కొన్ని నెలల క్రితం జరిగిన క్వాడ్ తొలి వర్చువల్ సమావేశాన్ని ఆయన ప్‌ిస్తావించారు. ఈ భేటీలో భాగంగా భారత్లో వ్యాక్సిన్ల ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు కృషి చేసేందుకు అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, జపాన్లు ముందుకు వచ్చాయని నెడ్ ప్రైస్ గుర్తు చేశారు. ఇక కరోనాపై పోరులో భాగంగా భారత్కు అగ్రరాజ్యం ఇప్పటివరకు 500 మిలియన్ డాలర్ల సాయాన్ని అందించిందని, దీనిలో బైడెన్ ప్రభుత్వమే స్వయంగా 100 మిలియన్ డాలర్ల సహాయం చేసిందన్నారు. అలాగే దేశంలోని ప్రైవేట్ సంస్థలు, టెక్ దిగ్గజాలను ఏకతాటిపైకి తెచ్చి భారత్‌కు సాయం చేయడంలో సెక్రటరీ ఆఫ్ స్టేట్ టోనీ బ్లింకెన్ కీలకంగా వ్యవహరించారని నెడ్ ప్రైస్ తెలిపారు. కాగా, ఇతర దేశాలకు టీకాల పంపిణీ విషయంలో అమెరికా గురువారం కీలక ప్రకటన చేసింది. భారత్ సహా ఇతర దేశాలకు తొలి విడతగా 25 మిలియన్ డోసుల వ్యాక్సిన్లు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇక ఈ నెలాఖరులోగా 55 మిలియన్ల టీకాలను ప్రపంచ దేశాలకు పంపిణీ చేయాల్సి ఉందని నెడ్ ప్రైస్ తెలియజేశారు.