YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పాలవెల్లువ ప్రారంభించని సీఎం జగన్

పాలవెల్లువ ప్రారంభించని సీఎం జగన్

అమరావతి
పాడి రైతుల సంక్షేమమే లక్ష్యంగా ఏపీ–అమూల్ పాల వెల్లువ ప్రాజెక్టును చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం, మరో అడుగు ముందుకు వేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో పాల సేకరణ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తన క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, పశ్చిమగోదావరి జిల్లాలో జగనన్న పాల వెల్లువకు శ్రీకారం చుట్టామన్నారు. పాదయాత్రలో పాల రైతుల కష్టాలు చూశానని, లీటర్ పాల ధర కంటే లీటర్ నీళ్ల ధరే ఎక్కువ ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు.ఇచ్చిన హామీ మేరకు పాడి రైతుల కోసం అమూల్ ప్రాజెక్ట్ను తీసుకొచ్చామని,ఇప్పటికే చిత్తూరు, ప్రకాశం, గుంటూరు, వైఎస్ఆర్ జిల్లాల్లో పాల సేకరణ జరుగుతోందని,ఇవాళ్టి నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో 153 గ్రామాల్లో అమూల్ సంస్థ పాలసేకరణ చేస్తుందని,రాష్ట్రంలో 9,899 గ్రామాలకు అమూల్ను విస్తరిస్తామని తెలిపారు.

Related Posts