ప్రశ్న :1.హిందూమతం, సనాతన హైందవ ధర్మం, హిందూ జీవన విధానం అంటే ఏమిటి ?
జవాబు: హిందుత్వం మనిషి ఎలా జీవించాలో... నువ్వు నిద్ర లేచి మళ్ళి నిద్ర పోయే వరుకు ప్రతిరోజూ ఏమి చెయ్యాలో, సమాజంలో ఎలా ఉండాలో మార్గం చూపిస్తుంది. అలాగే ఇతర ప్రాణులతో ఎలా మెలగాలి అనేది కూడా నేర్పుతుంది...
ప్రశ్న: 'హిందూ' అంటే అర్ధం ఏమిటి ? హిందూ అనే పేరు ఎవరు పెట్టారు? ఎపుడు పెట్టారు?
జవాబు: అందరికి తెలిసిన విషయమే హిందు అనే పదం కాలక్రమం లో వచ్చింది ధర్మం తో బ్రతకడం ప్రధాన ఉద్దేశ్యం. హిందూ మతం అనేది. మనం వాడుతున్న పదం. సనాతన హైందవ ధర్మం అనేది సరైన పదం.
ప్రశ్న: హిందూ ధర్మం యెక్క పవిత్ర గ్రంథం ఏమిటి?
జవాబు: హిందూ ధర్మం లో చాలా గ్రంధాలు ఉన్నాయి.. ప్రతి గ్రంధం కూడా చెప్పేది రెండఅక్షరాల పదం "ధర్మం" నువ్వు చెయ్యవలిసిన బాధ్యతయే నీ ధర్మం... మాకు అన్ని పవిత్ర గ్రంధాలే భగవద్గీత, రామాయణం మనుషులు ఎలా ఉండేవారో ,ఎలా ఉండాలో, నువ్వు ఆచరించవలసిన ధర్మాన్ని నీకు గుర్థుచెస్తూ చేస్తుఉంటాయి...
ప్రశ్న: హిందూ ధర్మం యెక్క దేవుళ్ళు ఎవరు?
జవాబు: సనాతన ధర్మం లో దేవుళ్ళు లేరు ఉన్నది ఒకటే.. పర బ్రహ్మం.. పరమేశ్వరుడు.. వేదములు ప్రకారం పరమేశ్వరునికి రూపం లేదు, దాని అర్ధం ఆయనకు రూపం ఉండదు అని, కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాలిసింది ఏమిటంటే అవతారము అని ఒకటి ఉంది. ఎప్పుడయితే అధర్మం ఎక్కువవుతుందో ధర్మాన్ని కాపాడటం కోసం అవతార రూపంలో వస్తారు. అది మన కళ్ళతో చూడగలం. అవతారం అంటే తార అవని పైకి వచ్చుట. పరమాత్మకు రూపం లేదు అనే కంటే ఈ విశ్వమే పరమాత్మ. పరమాత్మయే విశ్వమ్.. పరమాత్మ అన్ని జీవుల్లో ఉంటుంది. ఇందు గలడు అందు గలడు అను సందేహంబు వలందు ఎందెందు వెతికిన అందందే కలడు.
ప్రశ్న: వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ధర్మశాస్త్రాలు, రామాయణం, మహాభారతం, భగవద్గీత ఏ మతానికి చెందిందిన గ్రంధాలు?
జవాబు : ఈ గ్రంధాలు అన్నీ సనాతన హైందవ ధర్మం లోవి.
--భగవద్గీత ఒక మతానికే చెందినది కాదు! "సర్వ మానవాళికి ఆరాధన గ్రంధం"
అసలు మన భగవద్గీత ఏం చెబుతోంది.
-- ధర్మాధర్మాల గురించి చెపుతుంది.
-- కర్తవ్యం గురించి చెపుతుంది.
-- నాగరికత అంటే కోరికలను తీర్చుకోవడం. కాదు అదుపులో పెట్టుకోవడంఅని చెపుతుంది.
-- ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది.
-- సుఖం... శాంతి... త్యాగం ... యోగం... అంటే ఏమిటో చెబుతుంది.
-- ఏది శాశ్వతమో ఏది ఆశాశ్వతమో చెబుతుంది.
-- ఆత్మ తత్వం నిరూపణ ఇస్తుంది.
-- స్వకళ్యాణం కోసం కాక లోక కళ్యాణం కోసం జీవించమని చెపుతుంది.
-- జ్ఞానం ... మోక్షం ... అధ్యాత్మమ్ అంటే ఏమిటో చెబుతుంది.
-- ఎవరు పండితుడో ఎవరు స్థితప్రజ్ఞుడో చెబుతుంది.
-- ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం ఎంతో చెబుతుంది.
-- మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి ఎంతో చెబుతుంది.
-- పరమాత్మునికి ఎవరు ఇష్టుడో చెబుతుంది.
-- ఆయన్ను చేరే జ్ఞాన మార్గాలు ధ్వారా వేలు పట్టుకుని నడిపించి, మనిషిని దైవాన్ని చేస్తుంది.
-- నీలాంటి ఇతర ప్రాణికోటినీ ప్రేమించమని చెబుతుంది.
-- అనారోగ్యకరమైన భావోద్వేగాలను నియంత్రిస్తుంది.
ప్రశ్న: హిందూమతం స్వేచ్ఛను అనుమతించిందా?
జవాబు: "హిందూ ధర్మం" చాలా స్వేచ్చనిచ్చింది. ఎంతలా అంటే పరమేశ్వరుడుని అన్నింటిలోనూ చూసుకునేంత.
ప్రశ్న: హిందూమతం సమానత్వాన్ని అనుమతించిందా?
జవాబు: హిందూ ధర్మం సమానత్వాన్ని చూపుతుంది ఎంతటి వారైనా కర్మ ఫలం అనుభవించాల్సిందే... అందరూ ఒకటే అసలు సమానత్వం చూపాలంటే రెండు ఉండాలి.. హిందూ ధర్మంలో రెండు లేవు.. ఉన్నది ఒకటే అదే పరమాత్మ..అన్ని జీవాల్లో కనిపిస్తుంది...
ప్రశ్న: హిందూమతం న్యాయాన్ని అనుమతించిందా?
జవాబు: పేరులోనే ఉంది సనాతన "ధర్మం"..
ప్రశ్న: హిందూమతం ఆత్మ గౌరవాన్ని అనుమతించిందా?
జవాబు: హిందూ ధర్మం 'ఆహంబ్రహ్మాస్మి' అనుకోమంది.. అంతకు మించిన ఆత్మగౌరవం ఏముంది.
ప్రశ్న: హిందువు" గా జీవించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి?
జవాబు: హిందూధర్మం వెనుక లోకం హితం ఉంది. నువ్వు దానిని సక్రమంగా ఆచరిస్తే" సర్వేజనా సుఖినోభావంతు" లోకం అంతా సుఖశాంతులతో వర్దిల్లుతుంది.
ప్రశ్న: "హిందువు" గా ఎందుకు గర్వించాలి?"హిందూ" మతంలోని గొప్పతనం ఏమిటి?
జవాబు: పైన చెప్పినవే సమాధానాలు.. పైన చెప్పిందే హిందూ ధర్మం యొక్క గొప్పతనం.. ఇలాంటి ధర్మాన్ని ఆచరిస్తునందుకు చాలా గర్వంగా ఉంది.