YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

చినబాబుపై ఫోకస్ పెట్టిన వైసీపీ

చినబాబుపై ఫోకస్ పెట్టిన  వైసీపీ

గుంటూరు, జూన్ 5, 
చంద్రబాబు సీనియర్ రాజీకీయవేత్త. ఆయన ఒక విజన్ ఉందన్నది ఎవరైనా అంగీకరిస్తారు. అలాగే విపత్తు సమయాల్లో చంద్రబాబు పనితీరు కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే వచ్చే ఎన్నికల్లోనూ చంద్రబాబు ఫేస్ తోనే ఎన్నికలకు వెళితే తమకు కొంత ఇబ్బంది తలెత్తుతుందన్నది వైసీపీ భావన. ఎవరు అవునన్నా , కాదన్నా చంద్రబాబును సమర్థించే వారిలో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. దీంతో వైసీపీ వ్యూహం మార్చినట్లే కనపడుతుంది.వచ్చే ఎన్నికల్లో గెలిస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి కారనే ప్రచారాన్ని వైసీపీ ఉధృతం చేస్తోంది. వైైసీపీ సోషల్ మీడియా వింగ్ కూడా టీడీపీ ముఖ్మమంత్రి అభ్యర్థి లోకేష్ అంటూ పెద్దయెత్తున ప్రచారం చేస్తుంది. ఇది పక్కా వ్యూహం ప్రకారమే జరుగుతుందని టీడీపీ భావిస్తుంది. చంద్రబాబు ఇప్పటికే 70 ఏళ్లు దాటిపోయారు. వచ్చే ఎన్నికల నాటి వరకూ పార్టీని ఆయన నడపగలిగినా, ముఖ్యమంత్రి మాత్రం లోకేష్ అంటూ వైసీపీ చెబుతోంది.లోకేష్ పై ఇప్పటికే ప్రజల్లో సదభిప్రాయం లేదు. యువకుడు కావడం, సామాజిక అంశాలపై అవగాహన లేకపోవడం, మాట్లాడే తీరు బాగా లేకపోవడంతో దీనిని వైసీపీ క్యాష్ చేసుకోవాలని చూస్తుంది. అందుకే ఇటీవల మంత్రులు కూడా చంద్రబాబుపై చేసే విమర్శల్లో లోకేష్ ప్రస్తావన తీసుకువస్తుంది. తన కుమారుడిని ముఖ్యమంత్రిని చేయడానికే చంద్రబాబు ప్రభుత్వంపై లేని పోని అభాండాలు వేస్తున్నారని వైసీపీ మంత్రులు ఆరోపిస్తున్నారు.లోకేష్ ను ఫోకస్ చేస్తే తమకు లబ్ది చేకూరుతుందన్నది వైసీపీ నేతల అభిప్రాయం. చంద్రబాబు రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఎన్నికల సమయానికి పుంజుకునే అవకాశాలు లేకపోలేదు. అందుకే వైసీపీ నారా లోకేష్ ను ముందు పెట్టి రాజకీయ ఆటను ప్రారంభించందంటున్నారు. లోకేష్ ను ఎమ్మెల్సీని చేసి మరీ మంత్రిని చేసిన చంద్రబాబు మరోసారి అధికారం వస్తే ముఖ్యమంత్రిని ఎందుకు చేయరన్న ప్రశ్నను సంధిస్తుంది. ఈ ప్రచారం అసలే కష్టాల్లో ఉన్న టీడీపీకి కొంత ఇబ్బందికరమనే చెప్పాలి.

Related Posts