YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

టీడీపీ, జనసేన సయోధ్య

టీడీపీ, జనసేన సయోధ్య

విజయవాడ, జూన్ 5, 
వచ్చే ఎన్నికలకు టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు. అయితే ఈసారి చంద్రబాబు ఒంటరిగా పోటీ చేసే సాహసం చేయరు. ఇప్పటికి రెండు సార్లు ఒంటరిగా పోటీ చేసి చంద్రబాబు చేతులు కాల్చుకున్నారు. మరోసారి ఆ తప్పిదం చేయరు. ఇందుకోసం జనసేన పార్టీని తన జత చేర్చుకోవాలన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది. ఆయన ఇప్పటికే లింగమనేని రమేష్ ను రంగంలోకి దించారని ప్రచారం జరుగుతోంది.చంద్రబాబుకు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మధ్య సయోధ్య కుదర్చడానికి లింగమనేని రమేష్ ప్రయత్నాలు ప్రారంభించినట్లు చెబుతున్నారు. లింగమనేని రమేష్ గెస్ట్ హౌస్ లోనే చంద్రబాబు అమరావతిలో నివాసం ఉంటున్నారు. ఆయనకు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. అదే సమయంలో పవన్ కల్యాణ్ కు కూడా లింగమనేని రమేష్ ఆత్మీయుడే. ఇద్దరినీ కలిపే బాధ్యతను ఆయన తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలసి పోటీ చేయకపోతే గెలుపు కష్టమేనని భావించిన చంద్రబాబు ఎన్నికలకు ముందుగానే పొత్తు కుదుర్చుకోవాలని భావిస్తున్నారు. జనసేన కు కొన్ని ఎక్కువ స్థానాలను కేటాయించైనా దరి చేేర్చుకోవాలన్నది చంద్రబాబు ప్రయత్నం. బీజేపీని పక్కన పెట్టి వస్తే ఇంకా మంచిదన్నది చంద్రబాబు అభిప్రాయం. ఏపీలో బీజేపీపైన వ్యతిరేకత పెరగడంతో దానితో కలసి వెళితే గెలుపు కష్టమేనన్నది చంద్రబాబు భావన.అందుకోసం లింగమనేని రమేష్ ను చంద్రబాబు ఉపయోగించుకుంటున్నారని చెబుతున్నారు. చంద్రబాబుతో ఇటీవల హైదరాబాద్ లో ఆయన సమావేశమయినట్లు కూడా తెలిసింది. జనసేనకు కొన్ని ప్రాంతాల్లోనే పట్టు ఉండటం, ప్రధానంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువ సీట్లను వదులుకోవడానికైనా చంద్రబాబు సిద్ధపడినట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ‌్ ఈ ప్రతిపాదనపై ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాల్సిందే.

Related Posts