YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

దేశ సేవలనుంచి నిష్క్రమించిన నౌక సంధాయక్

దేశ సేవలనుంచి నిష్క్రమించిన నౌక సంధాయక్

విశాఖపట్నం
40 సంవత్సరాల పాటు దేశానికి సేవలందించిన భారతీయ నావికా దళానికి చెందిన హైడ్రోగ్రాఫిక్ సర్వే షిప్ ఐఎన్ఎస్ సంధాయక్ ఇక సెలవంటూ నిష్క్రమించింది.సర్వే మిషన్లు మాత్రమే కాకుండా, ఆపరేషన్ పవన్ - 1987 లో శ్రీలంకలో భారత శాంతి పరిరక్షక దళానికి సహాయం చేయడం, ఆపరేషన్ సరోంగ్, ఆపరేషన్ రెయిన్బో - 2004 లో సునామి తరువాత మానవతా సహాయం అందించడం.. తొలిసారిగా పాల్గొనడం వంటి అనేక ముఖ్యమైన కార్యకలాపాలలో ఈ నౌక చురుకుగా పాల్గొంది.టైగర్-ట్రయంఫ్ పేరుతో ఇండో-అమెరికా ఉమ్మడి నౌకా విన్యాసంలో కూడా ఈ నౌక పాల్గొంది. ఈఎన్ సి ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్- ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ అజేంద్ర బహ దూర్ సింగ్, ఎవిఎస్ఎమ్, విఎస్ఎమ్ సమక్షంలో ఈ వీడ్కోలు కార్యక్రమం జరిగింది.1981 ఫిబ్రవరి 26న ఈ నౌకను విశాఖలోనే భారత నౌకాదళంలో ప్రవేశ పెట్టారు. 40 ఏళ్ల వ్యవధిలో 200 పెద్ద హైడ్రో గ్రాఫిక్ సర్వేలను.. లెక్కలేనన్ని చిన్నపాటి సర్వేలను ఈ నౌక చేసింది. తూర్పు, పశ్చిమ తీరాలలో సముద్ర జలాల్లోనే కాకుండా అండమాన్ దీవులలో కూడా ఇది సర్వేలను చేపట్టింది.

Related Posts