విజయవాడ
ప్రారంభమైన వందే భారత్ మిషన్ విదేశీ సర్వీసులతో విదేశీ ప్రయాణికులు స్వదేశానికి చేరుకుంటున్నారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి మొదటి విడతలో సర్వీసుల ద్వారా 500 విమాానాల వరకు రాష్ట్రా నికి చేరుకుంటున్నాయి.ఏప్రిల్ 3న నిలిచిపోయిన విదేశీ విమాన సర్వీసు లు పునప్రారంభం కావడంతో ఇతర దేశాలలో చిక్కుకున్న వారు తమ ప్రాం తాలకు చేరుకుంటున్నారు.మొదటి విడతలో సుమారు 500 విమానాల ద్వారా 55 వేల మంది ప్రయాణికులు రాష్ట్రానికి చేరుకున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదివారం మినహా మిగతా రోజుల్లో విమాన ప్రయాణాలను అధికారులు కొనసా గేలా చర్యలు చేపట్టారు.గల్ఫ్ దేశాలైన మస్కట్, సింగపూర్, కువైట్ నుంచి నిరంతరం ఈ ప్రక్రియ కొనసాగుతుం దన్న తరుణంలో ప్రయాణికుల సౌకర్యం దృష్ట్యా అంతర్జాతీయ టెర్మినల్ భవనంలో కొవిడ్ నిబంధ నలు పాటించేలా ఏర్పాట్లు చేశారు.