YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

30లోగా ఖాతాదారులందారు ఆధార్‌, పాన్ కార్డును లింక్ చేయాల్సిందే... లేదంటే సేవ‌ల‌ను నిలిపేస్తాం: ఎస్‌బీఐ

30లోగా ఖాతాదారులందారు ఆధార్‌, పాన్ కార్డును లింక్ చేయాల్సిందే...  లేదంటే సేవ‌ల‌ను నిలిపేస్తాం: ఎస్‌బీఐ

న్యూఢిల్లీ జూన్ 5
ఇండియాలో అతిపెద్ద ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) త‌న కస్ట‌మ‌ర్ల‌కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 30లోగా ఖాతాదారులంతా మీ ఆధార్‌, పాన్ కార్డును లింక్ చేయాల్సిందేన‌ని, లేదంటే సేవ‌ల‌ను నిలిపేస్తామ‌ని ఎస్‌బీఐ స్ప‌ష్టం చేసింది. శుక్ర‌వారం చాలా మంది క‌స్ట‌మ‌ర్ల‌కు బ్యాంక్ నుంచి సందేశాలు అందాయి. కొంద‌రు త‌మ ఖాతాల్లో భారీగా ఉన్న డ‌బ్బును హోల్ట్‌లో పెట్టిన‌ట్లు బ్యాంక్ నుంచి వ‌చ్చిన మెసేజ్ చూసి ఆందోళ‌న చెందారు.అయితే బ్యాంక్‌లో పాన్‌, ఆధార్ కార్డ్‌తో స‌హా కేవైసీ వివ‌రాల‌ను అప్‌డేట్ చేస్తే తిరిగి హోల్డ్‌లో పెట్టిన మొత్తం, ఖాతాను తిరిగి యాక్టివేట్ చేస్తున్నారు. పాన్‌, ఆధార్‌ను ఎందుకు లింక్ చేయాలో కూడా క‌స్ట‌మ‌ర్ల‌కు ఎస్‌బీఐ వివ‌రించే ప్ర‌య‌త్నం చేస్తోంది.ఇక పాన్ కార్డుతో ఆధార్‌ను ఆన్‌లైన్‌లో లింకు చేసేందుకు www.incometaxindiaefilling.gov.in లింకును కూడా ఎస్‌బీఐ త‌మ క‌స్ట‌మ‌ర్ల‌తో షేర్ చేసింది. పాన్‌, ఆధార్ అనుసంధానికి జూన్ 30 చివరి తేదీ.
 

Related Posts