మంత్రాలయం, దళిత మహిళను నమ్మించి మోసం చేసిన ఎస్ఐ శీలంతో పాటు 3 లక్షల నగదు, నాలుగు తులాల బంగారం దోచుకున్న వైనం 10 సంవత్సరాల సహజీవనం. నీవెవరో నాకు తెలియదు దిక్కున్న చోట చెప్పుకో అంటూ బెదిరిస్తున్న ఎస్.ఐ. న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా బాధితురాలికి అండగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పురుషోత్తంరెడ్డి.
ఒక విధవరాలును మాయ మాటలు చెప్పి నమ్మించి శీలం దోచుకోవడమే కాకుండా డబ్బు గుంజి మోసం చేసి అంతా అయిపోయాక నేనెవరో తెలియదు పో అంటూ రోడ్డు మీద పడేలా చేసి , సమాజంలో మాయని మచ్చ అంటించుకుని తనకు ముప్పు తెచ్చుకున్న సంఘటన మంత్రాలయం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది . ఎమ్మిగనూరు పట్టణానికి 11వ వార్డు కు చెందిన సోమేశ్వరమ్మ అనే ఒక అమాయకురాలైన విధవరాలైన ఆడపడుచును ఒక కేసు విషయంలో తన దగ్గరకు వచ్చిన ఆమెను మోహించి నమ్మించి మోసం చేసి సహజీవనం చేసి సుఖాలు అనుభవించడమే కాకుండా ఆమె దగ్గర నుండి శీలంతో పాటు మూడు లక్షల రూపాయల నగదును నాలుగు తులాల బంగారాన్ని మాయమాటలు చెప్పి నమ్మించి తీసుకున్నాడు. అంతా అయిపోయాక ఆమెను నడిరోడ్డు పాలు చేశాడు. మాయమాటలు చెప్పిన కసాయి ఖాకిను నమ్మి ఆమె తన సర్వస్వం అర్పించు ఉంది.చివరికి మోసపోయారని తెలుసుకుని తనకు అండగా ఉండమని కోరింది .ఆమె తనను సరిగా చూసుకోమని అడిగినందుకు తన పోలీస్ బుద్ధిని చూపెట్టాడు. నోటికి వచ్చిన బండ బూతులు తిడుతూ నీవెవరివో తెలియదు నాకు సంబంధం లేదు నీ దిక్కున్న చోట చెప్పుకో పో నన్ను ఎవరూ ఏమీ చేయలేరు. అంటూ రాయడానికి వీలు లేని బాష ప్రయోగించాడు .దీంతో ఏం చేయాలో తెలియక మోసపోయానని గ్రహించిన బాధిత మహిళ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రముఖ న్యాయవాది అయిన పురుషోత్తంరెడ్డిని ఆశ్రయించారు. ఆమెకు జరిగిన అన్యాయాన్ని పురుషోత్తం రెడ్డి చలించిపోయారు. నీకు న్యాయం చేస్తామని ఎస్సై ఎర్రన్న ను సస్పెండ్ చేసే దాకా వదిలే ప్రసక్తే లేదని ఆమెకు ధైర్యాన్ని ఇచ్చారు. దీంతో శనివారం మంత్రాలయం పోలీస్ స్టేషన్ ఎదుట బాధితురాలు సోమేశ్వరమ్మతో పాటు బిజెపి నాయకుడు పురుషోత్తం రెడ్డి మిగతా బిజెపి నియోజకవర్గ నాయకులు పోలీస్స్టేషన్ ఎదుట ధర్నాకు ఉపక్రమించారు. నాకు న్యాయం చేయాలని నన్ను సర్వస్వం దోచుకున్నారని సిఐ.కృష్ణయ్య ఎదుట ఆమె కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఎస్సై ఎర్రన్ను ను అరెస్టు చేసి సస్పెండ్ చేయాలని నాకు న్యాయం చేయాలని సిపిఐ కృష్ణయ్యకు కంప్లైంట్ చేశారు. పాత్రికేయులు ప్రజలు పోలీసులు ఎదుట ఆమె తన బాధను వెలిబుచ్చారు. 10 సంవత్సరాల క్రితం కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ప్రస్తుత ఎస్ఐ ఎర్రన్న ఒక కేసు విషయంలో ఆయనను కలిశానని ఆయన నాకు మాయమాటలు చెప్పి నన్ను లోబరుచుకున్నాడు అని ఆవేదన వ్యక్తం చేశారు. నా భర్త చనిపోయిన తర్వాత ఆయన నన్ను చేరదీశాడు అని పది సంవత్సరాలుగా ఆయన నాతో సంబంధం ఏర్పరచుకున్నాడని నా దగ్గర నుండి మూడు లక్షల రూపాయల నగదు నాలుగు తులాల బంగారం కూడా తీసుకున్నాడని తెలిపారు. ఇప్పుడు నాకు న్యాయం చేయమని కోరితే నన్ను ఆదరించమని కోరితే నీవు ఎవరో నాకు తెలియదు నీ దిక్కున్న చోట చెప్పుకో నాకేం కాదు నన్ను ఎవరూ ఏమీ చేయలేరు అంటూ నన్ను బెదిరిస్తున్నారని ఆమె వాపోయారు. లైంగిక వేధింపులు కూడా ఎక్కువయ్యాయని ఆమె కన్నీళ్ల పర్యంతమయ్యారు .బిజెపి నాయకులు పురుషోత్తం రెడ్డి కూడా బాధితురాలు సోమేశ్వరమ్మకు అండగా ఉంటూ బిజెపి పార్టీ నీకు అండగా ఉంటుందని నీకు న్యాయం జరిగేదాకా బిజెపి పార్టీ పోరాటం చేస్తుందని చెప్పారు. ఆయన మాట్లాడుతూ ఒక ఆడపడుచచుకు అన్యాయం చేసిన ఎస్ఐ.ఎర్రన్నను సస్పెండ్ చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలు సోమేశ్వరమ్మకు న్యాయం జరిగేదాకా పోరాటం ఆగదని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు రామకృష్ణ మరియు కౌతాళం మండల ప్రధాన కార్యదర్శి రామ చంద్ర మరియు కోసిగి మండలాధ్యక్షులు పెండేకల్ రాముడు మరియు బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.