YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

విమర్శల్లో.. వాడివేడి..

 విమర్శల్లో.. వాడివేడి..

కేంద్రప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి పూర్తిగా మారిపోయింది. విమర్శల్లో పదును పెంచారు. కేంద్రం వైఫల్యాలపై ధ్వజమెత్తుతున్నారు. ప్రధానంగా రాష్ట్రానికి మోడీ నాయకత్వం చేసిన అన్యాయంపైనే కాక దేశంలో వెలుగుచూస్తున్న అత్యాచార ఘటనలు, బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు టోకరా వేసిన ఘరానా మోసగాళ్ల ఉదంతాలను హైలెట్ చేస్తున్నారు. కొన్నిరోజులుగా చంద్రబాబు స్టేట్మెంట్లు ఇలాగే కొనసాగుతున్నాయి. గతంలో హోదా ఇవ్వకుండా రాష్ట్రాన్ని ఏ విధంగా వేధిస్తున్నది వివరించిన ముఖ్యమంత్రి..  దేశంలో సాగుతున్న అన్యాయాలనూ ప్రస్తావిస్తూ కేంద్రప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని ఎండగడుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ నిలదొక్కుకునేందుకు కారకమైన పార్టీ టీడీపీ అనడంలో సందేహంలేదు. ఎందుకంటే 2014నాటి ఎన్నికల్లో ఇరు పార్టీలూ కలిసికట్టుగా బరిలోకి దిగాయి. దీంతో కాషాయదళం ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు గెలుచుకుంది. అయితే ఈ దఫా బీజేపీకి అలాంటి ఛాన్సేదీ లేకుండా చేయాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 25 ఎంపీ సీట్లన్నీ తమకే దక్కేలా ప్రణాళికలు వేస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా ప్రధానిని నిర్ణయించేంతటి అధికారం వస్తుందని స్పష్టంచేస్తున్నారు. 

 

కేంద్రంపై విమర్శల వాడి పెంచిన చంద్రబాబు.. రాష్ట్రీయంగానూ అదే ఎఫెక్ట్ కొనసాగేలా టీడీపీ వర్గాలను తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే ధర్మపోరాట దీక్షతో ఈ ఆందోళన ఓ రేంజ్ కు చేరుకుంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలుర్యాలీలు, సభలతో హోరెత్తిస్తున్నారు. రాష్ట్రాన్ని కేంద్రం ఏ విధంగా వంచిందీ ప్రజలకు వివరిస్తున్నారు. కేంద్రం ఏ రూపంలో దాడి చేసినా, రాష్ట్రంపైకి, వ్యక్తులపైకి వచ్చినా సంఘటితంగా ఎదుర్కొనేలా టీడీపీ వర్గాన్నే కాక ప్రజలనూ సంసిద్ధం చేస్తున్నారు ముఖ్యమంత్రి. మరోవైపు దక్షిణాదిన పాగా వేయాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు అన్నీఇన్నీకావు. కర్ణాటక ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలన్నది ఆ పార్టీ టార్గెట్. ఈ గెలుపుతో దక్షిణ భారత్ లో విస్తరించాలని ప్లాన్ చేస్తోంది. అయితే కాషాయ పార్టీ ఆశలకు గండికొట్టి తగిన గుణపాఠం చెప్పేందుకు టీడీపీ వర్గాలు ఉత్సాహంగా పనిచేస్తున్నాయి. బీజేపీది ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసే నైజమని.. సాక్షాత్తూ ప్రధాని తనకు తానే ఇచ్చిన హామీలను నెరవేర్చని విమర్శిస్తున్నాయి. ఇక కర్ణాటకలోని తెలుగువారూ కేంద్రంపై అసంతృప్తితోనే ఉన్నారు. ఈ అసంతృప్తి ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. 

Related Posts