YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విదేశీయం

ట్రంప్ బాటలో బైడెన్...మరో 28 చైనా కంపెనీలను బ్లాక్ లిస్ట్ లో..

ట్రంప్ బాటలో బైడెన్...మరో 28 చైనా కంపెనీలను బ్లాక్ లిస్ట్ లో..

న్యూ ఢిల్లీ జూన్ 6,
చైనా పై అగ్రరాజ్యం అమెరికా కయ్యానికి  ఇంకా కత్తి దుసుతోంది. గత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బాటలోనే ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కూడా చైనా సంస్థలపై కక్షగట్టారు. ఇందులో భాగంగా చైనాకు సంబంధించిన మరికొన్ని సంస్థలను బ్లాక్ లిస్ట్ లోకి తరలించారు. ముఖ్యంగా బీజింగ్ లోని సైనిక సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్న తమ దేశంలోని అమెరికా పెట్టుబడిదారులపై పరిమితులు విధించింది. 31 చైనా కంపెనీల్లో వాటాలను కొనుగోలు చేయకుండా గత అధ్యక్షుడు ట్రంప్ అడ్డుకుంటే ఇప్పుడు మరో 28 కంపెనీలపై ఆంక్షలను విధించిన బైడెన్ ఆ సంఖ్యను 59కి పెంచారు.అమెరికాను భద్రత లేదా ప్రజాస్వామ్య విలువలను అణగదొక్కే తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనను సులభతరం చేసేందుకు వినియోగించే చైనా నిఘా సాంకేతిక పరిజ్ఞానంలో భాగస్వాములైన కంపెనీలపై ఈ ఆంక్షలు విధించినట్లు వైట్ హౌస్ ప్రకటించింది. తొలి జాబితాలో చైనా మొబైల్ చైనా టెలికాం వీడియో నిఘా సంస్థలు హిక్ విజన్ చైనా రైల్వేవ కన్స్ట్రక్షన్ కార్ఫ్ వంటి ప్రధాన టెలికాం సంస్థలు కన్ స్ట్రక్షన్ టెక్నాలజీ సంస్థలపై ట్రంప్ సర్కార్ బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. ఆయా కంపెనీలకు చైనా సైన్యం నిఘా సంస్థలతో బలమైన సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తోంది. అందుకే తమ దేశంలో పెట్టుబడులు పెట్టే కొన్ని చైనా కంపెనీలపై ఇప్పటికే ఆంక్షలు విధించింది. ఈ జాబితాలో తాజాగా మరికొన్ని కంపెనీలను చేర్చింది. అమెరికా ప్రభుత్వం ఆ ఉత్తర్వును వెంటనే వెనక్కి తీసుకోవాలని చైనా కోరింది. అమెరికాలో చైనా కంపెనీలకు సానుకూల పెట్టుబడి వ్యాపార వాతావరణాన్ని కల్పించాలని తెలిపింది. తమ సంస్థలు కంపెనీలపై ఎలాంటి వివక్ష చూపొద్దని కోరింది. చైనా కంపెనీల హక్కుల పరిరక్షిస్తామని తెలిపింది.

Related Posts