YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఈటలకు శుభం కార్డు... పడుతుందా

ఈటలకు శుభం కార్డు... పడుతుందా

హైద్రాబాద్, జూన్ 7,
మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఎత్తుకున్న నినాదం ఆత్మగౌరవం. బహుజనుల ప్రతినిధిని అంటున్నారు. లెఫ్ట్ ఆలోచనలతో రాజకీయ ప్రవేశం చేశానన్నాడు.  కానీ చివరికి ఈటల అడుగులు ఎటు పడుతున్నాయి. ఈటల చెప్పిన ఆత్మగౌరవ వాగ్థానాన్ని నిలబెట్టుకుంటారా?, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే వైపు అడుగులు వేస్తున్నారా?.ఇక ఈటల వ్యవహారంలో బహుజనులు ఏదో ఊహించుకున్నారు. బహుజన నాయకత్వం బలపడుతుందని ఆశించారు. కానీ ఈటలకు మాత్రం ఇవేమీ పట్టలేదు. వివిధ పార్టీల ప్రతినిధులతో ఈటల చర్చలు జరిపారు. ఈటలతో వివిధ పార్టీల ప్రతినిధులూ చర్చించారు. చివరకు ఈటల ఎంచుకున్న మార్గంపై బహుజన ప్రతినిధులు బహిరంగ లేఖ రాసి తమ ఆశలను, ఆవేదనను వెలిబుచ్చారు.వామపక్షనాయకులు, విశ్లేషకులు సైతం ఈటల ఎంచుకునే మార్గంపై చాలా సూచనలు చేశారు. కానీ ఈటల మాత్రం. తన మార్గం తను ఎంచుకోని ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో “ఈటల” కథలో పావులు అయిందెవరు?. పరాజితులు ఎవరు? అనే ప్రశ్నను బహుజన సమాజం వేసుకోవాల్సిన అవసరం ఉంది. సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందిఅయితే ఈటల బుర్రలో ఉన్న అసలు తత్వాన్ని అర్థం చేసుకోవాలి. చరిత్ర అందించిన అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలేదనే వాదన వినిపిస్తోంది. ఈ పరీక్షా సమయంలో “ఈటల” ఆత్మగౌరవం వైపా..? ఆత్మవంచన వైపా? అనేది త్వరలో తెలిపోనుంది. ఆత్మగౌరవాన్ని పక్కనపెట్టి ఆస్తుల రక్షణకు ఆత్మవంచనకు సైతం వెనుకాడబోడనని ‘ఈటల కథ’ శుభం కార్డు వేస్తుందా?. ఈ రాజకీయ చదరంగంలో కాలం ఎవరిని పరాజితులను చేస్తుందో చూడాలి.

Related Posts