మానస సరోవరంలో రాహుల్ ఏం చేస్తాడనే చర్చ సాగుతోంది. నెల రోజుల పాటు కనపడకుండా వెళ్లిన రాహుల్ మంచి స్పీకర్ గా మారాడు. గతం కంటే ఆత్మవిశ్వాసంతో కనపడ్డారు. కరాటేతో పాటు.. యోగా వంటి విద్యలను నేర్చుకున్నాడంటున్నారు. మానసిక ప్రశాంతత కోసం అలా రాహుల్ వెళ్లాడని కాంగ్రెస్ నేతలు చెప్పారు. ఈ సారి ఎలా తయారై వస్తాడో చూడాలి. అయితే..ఇప్పుడు ఈ చర్చ ఎందుకుంటే...కర్నాటక ఎన్నికల ప్రచారంలో మోడీ సర్కార్‌పై ఆక్రోశం వెళ్లగక్కారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. అప్పుడే కర్ణాటకలో రాహుల్ ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా 8 వేల అడుగులు కిందకు జారిపోయింది. ఆ సమయంలో తీవ్ర భయాందోళనకు గురైన రాహుల్ గాంధీకి కైలాస పర్వతం గుర్తొచ్చిందట. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడమే ఇందుకు కారణం. నలభై నిమిషాల పాటు గాలిలోనే ఆయన చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత మానస సరోవర యాత్రకు వెళ్లేందుకు ఆయన సిద్దమయ్యారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా రాహుల్ ఈ విషయం కార్యకర్తలకు చెప్పి తనకు సెలవు కావాలని అడిగారు. అంతే సభలో ఉన్న నేతలంతా హర్షధ్వానాలతో ఆమోదం తెలిపారు. పార్లమెంటు సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి. ప్రధాన విపక్ష నేత రాహుల్ గాంధీ సభలో లేరు. ఎక్కడకు వెళ్లారంటే సమాధానం లేదు. ఆ రోజే కాదు… నెల రోజుల పాటు రాహుల్ సభకు రాలేదు. ఇది జరిగి రెండేళ్లకు పైగానే అయింది. ప్రధాని మోడీని ఇరుకున పెట్టాల్సిన సమయంలో విదేశాలకు పారిపోయాడనే ప్రచారం వచ్చింది. ఆతర్వాత మరోసారి ఇంగ్లండ్, ఇటలీ వంటి దేశాలకు వెళ్లారు రాహుల్ గాంధీ. పార్లమెంటు సమావేశాలు సీరియస్ గా జరిగే సమయంలోనే రాహుల్ అలా వెళ్లడం విమర్శలకు తావిచ్చింది. రాహుల్ గాంధీ అప్పుడు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మాత్రమే. ఇప్పుడు పూర్తి స్థాయి అధ్యక్షులు. కాబట్టి తాను చాలా బాధ్యతగా వ్యవహరించాలి అనుకుంటున్నాడు. అందుకే మరోసారి సెలవు పెడుతున్నారు.