YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఆనందయ్య మందు కాకాణి వర్సెస్ సోమిరెడ్డి

ఆనందయ్య మందు కాకాణి వర్సెస్ సోమిరెడ్డి

నెల్లూరు, జూన్ 7, 
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆనంద‌య్య మందు గురించి ఎంత పెద్ద చ‌ర్చ జ‌రుగుతుందో చూస్తూనే ఉన్నాం. చాలామంది ఆయ‌న మందుకు మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. మ‌రి కొంద‌రేమో వాడొద్దంటూ వాదిస్తున్నారు. కానీ ఫైన‌ల్‌గా ఆయ‌న మందుకు ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దీంతో ఈ మందుపై మాజీ మంత్రి సోమిరెడ్డి తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు.ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి ఆ మందును బ్లాక్ అమ్మి కోట్లు సంపాదించేందుకు కుట్ర చేస్తున్నాడ‌ని ఆరోపించారు. ఓ వెబ్ సైట్ ద్వారా వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి నాటు మందును అమ్మేందుక ప్లాన్ చేస్తున్నాడంటూ ఆరోపించారు.దీనిపై ఎమ్మెల్యే కూడా గ‌ట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. త‌నకు ఎలాంటి అస‌వ‌రం లేద‌ని, టీడీపీ కావాల‌ని రాజ‌కీయం చేస్తోంద‌ని విమ‌ర్శించారు. ఇక మాజీ మంత్రి ఆరోప‌ణ‌ల‌పై సదురు వెబ్ సైట్ శేశ్రిత టెక్నాలజీ ఎండీ నర్మాదరెడ్డి ఏకంగా పోలీస్ కేసు పెట్టారు. దీంతో సోమిరెడ్డిపై చీటింగ్ ఫోర్జరీ దొంగతనం కేసులు న‌మోద‌య్యాయి. ఈ కేసుల‌తో నెల్లూరు జిల్లా అట్టుడికిపోతోంది. దీనిపై టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి. అయితే ఆనంద‌య్య మాత్రం త‌న‌ను రాజ‌కీయాల్లోకి లాగొద్ద‌ని కోరుతున్నారు.మాజీ మంత్రి సోమిరెడ్డి‌పై కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. తమ అనుమతి లేకుండా డేటా చోరీ చేశారని, మోసపూరిత కుట్ర చేస్తున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి‌పై కృష్ణపట్నం పోర్టు పోలీస్ స్టేషన్‌లో శ్రేశిత టెక్నాలజీస్ సంస్థ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. పూర్తిగా డెవలప్ చేయని తమ సైట్‌ని సోమిరెడ్డి రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని శ్రేశిత టెక్నాలజీస్ ఎండీ నర్మద్ రెడ్డి పేర్కొన్నారు. తనపై చేసిన ఆరోపణలు వల్ల తమ కంపెనీకి చెడ్డపేరు వచ్చిందని, దీనిపై సోమిరెడ్డి‌పై చర్యలు తీసుకోవాలని శ్రేశిత టెక్నాలజీస్ ఎండీ నర్మదా రెడ్డి డిమాండ్ చేశారు.మా సంస్థపై అసత్య ఆరోపణలు చేసిన దానిపై కేసు పెట్టడం జరిగింది. మేము అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు. అవగాహన లేకుండా సోమిరెడ్డి మా సంస్థపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. మా డేటాని మాకు తెలీయకుండా చోరీ చేశారు. మేము వైసీపీ అభిమానులమే, కానీ మా సంస్థపై ఇలాంటి ఆరోపణలు చేయడం దారుణం. మేము ప్రజలకు మంచి చేయడం కోసం వెబ్ సైట్ క్రియేట్ చేశాం.’’ అని నర్మదారెడ్డి తెలిపారు.కాగా ఆనందయ్య మందు పేరుతో సోమ్ము చేసుకోవాలని ఎమ్మెల్యే కాకాణి ప్రయత్నిస్తున్నారని సోమిరెడ్డి శనివారం ప్రెస్ మీట్ పెట్టి అన్నారు . మే 21 నుండి ఆనందయ్య మందును క్యాష్ చేసుకోవాలన్న కుట్రలు ప్రారంభమయ్యాయన్నారు. శ్రేషిత టెక్నాలజీ వద్ద సైట్‌కొని ఇంటర్నెట్‌లో హోస్ట్ చేసి వెంటనే డిలీట్ చేసినట్లు తెలిపారు. శ్రేషిత కంపెనీలో డైరెక్టర్లు వైసీపీ నాయకులని ఆరోపించారు. సైట్‌లో రూ.15 పెట్టి ప్రజలకు అందుబాటులోకి వచ్చే వచ్చిన తర్వాత రూ.167 చేశారని పేర్కొన్నారు. కోటి మందికి ఆన్‌లైన్‌లో మందు అమ్మి రూ.120 కోట్లు సొమ్ము చేసుకునేందుకు కాకాణి గోవర్దన్ కుటిల ప్రయత్నం చేశారని వ్యాఖ్యానించారుఇక సోమిరెడ్డి వ్యాఖ్యలపై ఆదివారం సీరియస్ అయింది. ఆయనపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమిరెడ్డిపై ఫిర్యాదు చేశారు. మరి సోమిరెడ్డి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

Related Posts