YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

టీడీపీలోనేనా...వైసీపీలోకా.... డీకే ఫ్యామిలీలో..కిం కర్తవ్యం

టీడీపీలోనేనా...వైసీపీలోకా.... డీకే ఫ్యామిలీలో..కిం కర్తవ్యం

తిరుపతి, జూన్ 7, 
ఏపీలోని చిత్తూరు జిల్లా రాజ‌కీయాల్లో సంచ‌ల‌నాల‌కు వేదిక‌గా మారి.. మూడు ద‌శాబ్దాల పాటు రాజ‌కీయంగా చ‌క్రం తిప్పారు.. ఆ కుటుంబ నేత‌లే డీకే ఆదికేశ‌వుల నాయుడు, స‌త్యప్రభలు. చిత్తూరు జిల్లా నుంచి ఎంపీగా గెలిచిన ఆదికేశ‌వుల నాయుడుకు రాజ‌కీయంగానే కాక వ్యాపారాల ప‌రంగా కూడా దేశ‌వ్యాప్తంగా మంచి పేరుంది. ప్ర‌స్తుతం వార్త‌ల్లో ఉన్న విజ‌య్ మాల్యాకు వ్యాపార గురువుగా.. ఆదికేశ‌వుల నాయుడు వ్యవ‌హ‌రించారు. మాల్యా.. వ్యాపారాలు.. వ్యవ‌హారాల్లో ఆదికేశ‌వుల నాయుడు ప్రభావం ఎక్కువగాఉంది. ఈ ఇద్దరూ క‌లిసి అనేక వ్యాపారాలు కూడా నిర్వహించారుఈ క్రమంలోనే తొలుత క‌ర్ణాట‌క పాలిటిక్స్‌లో ప్రవేశించిన డీకే ఆదికేశ‌వుల నాయుడు క‌ర్ణాట‌క మాజీ సీఎం రామ‌కృష్ణ హేగ్డేతో అనేక విష‌యాల్లో విభేదించి.. రికార్డు సొంతం చేసుకున్నారు. ఆ త‌ర్వాత‌.. ఏపీ రాజ‌కీయాల‌పై దృష్టి పెట్టి.. చంద్రబాబు పిలుపుతో టీడీపీలోకి వ‌చ్చారు. ఈ క్రమంలోనే చిత్తూరు ఎంపీగా 2004లో విజ‌యం ద‌క్కించుకున్నారు. లిక్కర్, విద్య, రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారాలు స‌హా అనేక వ్యాపారాల్లో డీకే ఆదికేశ‌వుల నాయుడు పేరు గ‌డించారు. త‌ర్వాత దివంగ‌త మాజీ సీఎం వైఎస్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఒత్తిళ్లతో యూపీఏ ప్రభుత్వంపై ప్రతిప‌క్షాలు ప్ర‌వేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి ఓటేశారు. అందుకే ఆయ‌న‌కు టీటీడీ చైర్మన్ ప‌ద‌వి బ‌హుమానంగా వ‌చ్చింది. డీకే ఆదికేశ‌వుల నాయుడు మ‌ర‌ణం త‌ర్వాత‌.. ఆయ‌న స‌తీమ‌ణి.. స‌త్యప్ర‌భ.. 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున చిత్తూరు నుంచి పోటీ చేసి విజ‌యం సాధించారు. ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లోనే వీరి వార‌సుడు డీకే శ్రీనివాస్‌ను రంగంలోకి తీసుకురావాల‌ని ప్రయ‌త్నించినా.. చంద్రబాబు అప్పటి రాజ‌కీయ ప‌రిస్థితిని దృష్టిలో ఉంచుకుని వ‌ద్దన్నట్టుగా వార్తలు వ‌చ్చాయి. అలాగే స‌త్యప్రభ‌కు ఇష్టంలేక‌పోయినా ఆమెను చిత్తూరు అసెంబ్లీ నుంచి కాకుండా రాజంపేట ఎంపీగా పోటీ చేయించ‌గా ఆమె ఓడిపోయారు. ఆ త‌ర్వాత డీకే ఆదికేశ‌వుల నాయుడు ఫ్యామిలీని రాజ‌కీయంగా టార్గెట్ చేశారు. వారు చంద్రబాబు సాయం కోరినా కూడా ప‌ట్టించుకోలేదు. అప్పటి నుంచి వారు పార్టీకి దూరంగా ఉంటోన్న టైంలోనే స‌త్యప్రభ మృతిచెందారు. ఈ క్రమంలోనే టీడీపీ కంటే వైసీపీ బెట‌ర్ అని భావించిన ఆమె కుమారుడు.. శ్రీనివాస్‌.. సీఎం జ‌గ‌న్ ను క‌ల‌వ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. అయితే.. శ్రీనివాస్‌.. విష‌యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. శ్రీనివాస్ కూడా ఎలాంటి ప్రయ‌త్నాలు త‌ర్వాత చేయ‌లేదు. ఇప్పుడు శ్రీనివాస్ కూడా మౌనంగా ఉన్నారు. వైసీపీ నుంచి కూడా ఎలాంటి ప్రయ‌త్నాలు సాగ‌డం లేదు. అయితే డీకే ఆదికేశ‌వుల నాయుడు ఫ్యామిలీ వ్యాపారాల‌కు అయితే ఎలాంటి ఇబ్బంది లేద‌ని తెలుస్తోంది. టీడీపీ కూడా ఈ కుటుంబాన్ని ప‌ట్టించుకోవ‌డం లేదు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో డీకే కుటుంబ రాజ‌కీయాలు ముగిసిన‌ట్టేనా? అనే చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

Related Posts