ముంబై, జూన్ 7,
పీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన 31 మ్యాచ్‌ల షెడ్యూల్‌పై పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చేసింది. యూఏఈ వేదికగా ఐపీఎల్ 2021 సీజన్ రీస్టార్ట్ అవుతుందని ఇప్పటికే ప్రకటించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ).. సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 15 వరకూ టోర్నీని నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు షెడ్యూల్‌పై ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)తోనూ బీసీసీఐ చర్చించి ఈ తేదీలను ఖాయం చేసినట్లు తెలుస్తోంది.షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ 2021 సీజన్‌లో మొత్తం 60 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా.. 29 మ్యాచ్‌లు ముగిసే సమయానికి జట్లలో కరోనా కేసులు వరుసగా నమోదయ్యాయి. దాంతో.. మే 4న టోర్నీని నిరవధికంగా వాయిదా వేసిన బీసీసీఐ.. రీషెడ్యూల్‌పై కసరత్తుల్ని పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ సీజన్‌లో మిగిలిన 31 మ్యాచ్‌లను ఈ ఏడాది నిర్వహించలేకపోతే బీసీసీఐకి వచ్చే నష్టం సుమారు రూ.2,500 కోట్లు. అక్టోబరు 15న (దసరా రోజున) ఫైనల్‌తో ఐపీఎల్ 2021 సీజన్ ముగియనుండగా.. ఆ వెంటనే టీ20 వరల్డ్‌కప్ ప్రారంభంకానుంది.ఐపీఎల్ 2021 సీజన్ కోసం 27 రోజుల విండోని కేటాయిస్తున్న బీసీసీఐ.. 31 మ్యాచ్‌లకిగానూ 10 డబుల్ హెడర్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రోజు గ్యాప్‌లో ప్లేఆఫ్ మ్యాచ్‌లను నిర్వహించబోతుండగా.. ఫైనల్ మ్యాచ్‌కి మాత్రం రెండు రోజుల గ్యాప్‌ని కేటాయించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లను ఆడేందుకు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా క్రికెటర్లు యూఏఈకి రావడంపై సందిగ్ధత నెలకొంది. సెప్టెంబరు 14 వరకూ ఇంగ్లాండ్ పర్యటనలో ఉండనున్న భారత క్రికెటర్లు కూడా టోర్నీకి కేవలం మూడు రోజుల ముందే యూఏఈకి రానున్నారు.