ఎంసెట్-2018 ప్రవేశ పరీక్ష ఫలితాలను మే 2న విడుదల కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విజయవాడలో ఫలితాలను విడుదల చేస్తారని కన్వీనర్ ప్రొఫెసర్ సీహెచ్ సాయిబాబు తెలిపారు. అనంతరం విద్యార్థుల సెల్‌ఫోన్ నంబర్లకు ర్యాంకులను పంపిస్తామన్నారు. ఎంసెట్ ఫలితాలను www.sche.ap.gov.in/eamcet , www.vidyavision.com, www.manabadi.com, www.manabadi.co.in, www.schools9.com వెబ్‌సైట్ ద్వారా కూడా పొందవచ్చని తెలిపారు.