YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

మళ్లీ రెచ్చిపోయిన శ్రీరెడ్డి

మళ్లీ రెచ్చిపోయిన శ్రీరెడ్డి

హైదరాబాద్, జూన్ 7, 
'కాస్టింగ్ కౌచ్' అంటూ సినీ పెద్దలపై విరుచుకుపడుతూ నడిరోడ్డుపై అర్ధనగ్న ప్రదర్శన చేసి దేశవ్యాప్తంగా ఫేమ్ అయిందిశ్రీ రెడ్డి. సినీ ఇండస్ట్రీలో మహిళలను నమ్మించి మోసం చేస్తూ లైంగికంగా దోచుకుంటున్నారని ఆరోపణలు చేసిన శ్రీ రెడ్డి.. అప్పటి నుంచి ఏ చిన్న సందర్భం దొరికినా రెచ్చిపోతోంది. సంచలన తారగా నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఈ నేసథ్యంలోనే నిన్న విశాఖలో ఓ యువతి హల్చల్ చేసిన ఉదంతంపై ఆమె షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది. ఒక్క సినీ ఇండస్ట్రీ మాత్రమే కాదు.. అన్ని వర్గాల వారిని టార్గెట్ చేస్తూ ఎప్పటికప్పుడు వివాదాస్పద అంశాలతో రచ్చ చేయడం శ్రీ రెడ్డికి కామన్ అయింది. ఈ మధ్యకాలంలో అయితే రాజకీయ అంశాల జోలికి పోతూ తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా బయటపెట్టి సెన్సేషన్స్ క్రియేట్ చేస్తోంది శ్రీ రెడ్డి. నిత్యం సమాజంలో జరిగే అంశాలపై ఆమె రియాక్ట్ అవుతున్న తీరు హాట్ టాపిక్ అవుతోంది. ఈ క్రమంలోనే నిన్న విశాఖలో జరిగిన ఇన్సిడెంట్‌పై స్పందించిన శ్రీ రెడ్డి.. పోలీసుల డ్యూటీ, అమ్మాయి తీరుపై ఓపెన్ కామెంట్స్ చేసింది. గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్ డౌన్ అమలులో ఉన్న కారణంగా పోలీసులు పకడ్బందీగా లాక్ డౌన్ నిబంధనలను అమలు పర్చారు. ఇందులో భాగంగా మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఎవరు కనబడినా వారి మీద చర్యలు తీసుకుంటూ, వారి వారి వాహనాలకు చలానాలు విధించారు. అయితే కర్ఫ్యూ సమయంలో బయట తిరిగేందుకు అనుమతి ఉన్న తన వాహనానికి పోలీసులు ఫైన్ వేశారంటూ వైజాగ్‌లో ఓ యువతి వీరంగం సృష్టించింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి జనాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ అంశం మీద రాజకీయంగా పెను దుమారం రేగడంతో పోలీసులు ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసి ఆ యువతి తీరును తప్పుబట్టారు. అయితే నెటిజన్లు మాత్రం సదరు యువతిని సపోర్ట్ చేస్తూ పోలీసుల చర్యను ఎండగడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై శ్రీ రెడ్డి స్పందిస్తూ పోలీసులకు సపోర్ట్ చేసింది. పోలీస్ అనగానే జనాల్లో లంచం తీసుకునేవాడు అనే అపోహ మాత్రమే ఉంటుందని, ప్రతి పోలీసు అలాంటివాడే అనుకుంటారని చెబుతూ పోలీసుల శ్రమ గురించి మాట్లాడింది. ఇక నిన్నటి ఇన్సిడెంట్‌లో పోలీసులు తమ డ్యూటీ తాము చేశారని, ఆన్ డ్యూటీలో ఉన్న పోలీసులపై దుర్భషలాడటం యువతి మిస్టేక్ అని చెప్పింది. కరోనా కట్టడి చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది కాబట్టి పోలీసులు అలా చేశారని, సదరు యువతి డ్రామా ఆడినట్లు అందరికీ అర్థం అవుతోందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది శ్రీ రెడ్డి. దీంతో ఈ ఇష్యూ మరోసారి జనాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Related Posts