YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

తవ్విన కొద్ది. ఎక్సైజ్ శాఖలో ఇంటిదొంగల గుట్టు

తవ్విన కొద్ది. ఎక్సైజ్ శాఖలో ఇంటిదొంగల గుట్టు

విశాఖపట్టణం, జూన్ 8, 
విశాఖ ఎక్సైజ్ స్కామ్ కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. ప్రభుత్వ మద్యం షాపుల్లో నగదు దుర్వినియోగంపై విచారణ జరిపి హెడ్ కానిస్టేబుల్ కొండయ్య సహా మరో ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. అలాగే ఎస్ఐ విమలాదేవిపై చర్యలకు ఎక్సైజ్ కమిషనర్ కు సిఫార్సు చేశారు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు. ఈ స్కామ్ లో ఇప్పటికే ఎక్సైజ్ సీఐ నాగ శ్రీనివాసరావుపై వేటు వేశారు అధికారులు.మర్రిపాలెం స్పెన్సర్ లో, గోపాల్ పట్నంలోని లక్షీనగర్, మల్కాపురం మద్యం షాపుల్లో అక్రమాలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. మొత్తం 33లక్షల రూపాయల నగదు పక్కదారి పట్టగా, అందులో 8.5లక్షలు మాత్రమే అధికారులు రికవరీ చేశారు.ప్రభుత్వ మద్యం షాపుల్లో నగదు అవకతవకలపై లోతైన విచారణ జరుపుతున్నారు. విశాఖ సర్కిల్-4 పరిధిలో నాలుగు షాపుల్లో నగదు పక్కదారి పట్టినట్టు నిర్ధారణ అయింది. మొత్తం 33లక్షల రూపాయలు నొక్కేశారు సిబ్బంది.ఇందులో బాధ్యులైన సీఐ శ్రీనివాసరావుని విధుల నుంచి తప్పించారు ఉన్నతాధికారులు. ఇద్దరు కానిస్టేబుళ్లపై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. జిల్లాలో స్పెషల్ డ్రైవ్ కు ఆదేశించిన అధికారులు.. సూపర్ వైజర్లు, వైన్ షాప్ సిబ్బందిని విచారిస్తున్నారు. ఇంకా 12మంది సిబ్బందికి నోటీసులు ఇచ్చాము. నిధులు రికవరీ తర్వాత క్రిమినల్ కేసులు పెడతామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు చెప్పారు.

Related Posts