YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగన్ హస్తిన టూర్ వెనుక...

జగన్ హస్తిన టూర్  వెనుక...

న్యూఢిల్లీ, జూన్ 8, 
జగన్ రెండేళ్ళ మౌనాన్ని వీడబోతున్నారా. తనను తానే గట్టిగా నమ్ముకుంటున్నారా అంటే సమాధానం అవును అనే వస్తోంది. జగన్ కష్టపడి అధికారం సంపాదించారు. అలాగే అనేక మందికి ముఖ్య బాధ్యతలు కూడా ఇచ్చారు. మరి కీలకమైన స్థానాల‌లో ఉన్న వారు జగన్ కి మేలు చేస్తున్నారా. ఆయన కోరుకున్న విధంగా పని చేస్తున్నారా అంటే సమాధానం నిరాశాపూరితంగానే వస్తుంది. ముఖ్యంగా ఢిల్లీ లాబీయింగ్ విషయంలో వైసీపీ పూర్తిగా ఫెయిల్ అయింది అని చెప్పవచ్చు. ఒక్క రెబెల్ ఎంపీ మొత్తం ఢిల్లీ రాజకీయాన్ని అనుకూలం చేసుకుంటూంటే వైసీపీ మాత్రం ఇంత పెద్ద పార్టీ అయి ఉండి చేష్టలుడిగి చూస్తోంది అనే చెప్పాలి. ఇక ఢిల్లీలో జగన్ నమ్మిన బంటు విజయసాయిరెడ్డి మొత్తం వైసీపీ పార్లమెంటరీ వ్యవహారాలు చూస్తున్నారు. ఆయన విపక్షంలో ఉండగా అనేక విజయాలు సాధించారు. జగన్ కోరుకున్నపుడల్లా అపాయింట్మెంట్ నేరుగా ప్రధానితో ఇప్పించిన ఘనత కూడా ఆయన సొంతమని అంతా అనేవారు. అలాటి ఆయన అధికారంలోకి వచ్చాక మాత్రం బాగా డల్ అయ్యారు. ఆయన చక్రం విశాఖలో తిరుగుతోంది కానీ ఢిల్లీలో మాత్రం ఏమీ కాకుండానే ఉంది. లేకపోతే 27 మంది ఎంపీలు వైసీపీకి ఉంటే ఒకే ఒక ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు మాట కేంద్ర ప్రభుత్వం వద్ద చెల్లడం అంటే నిజంగా వైసీపీ లాబీయింగ్ ఫెయిల్యూర్ అనుకోవాలేమో. మరో వైపు చూస్తే బీజేపీ ఇపుడు మోడీ అమిత్ షా నాయకత్వంలో నడుస్తోంది. వారిద్దరి రాజకీయ వ్యూహాలు ఎవరికీ అంత తొందరగా అర్ధం కావు. ఇక జనాలనే నమ్ముకునే జగన్ లాంటి యువ నేతలకు వ్యూహాలతో పెద్దగా పని లేదని అంతా అనుకుంటారు. కానీ వ్యూహాలు కూడా ఎప్పటికపుడు అవసరమే. వాటిని పదును పెట్టాల్సిందే అని తాజా రాజకీయ పరిణామాలు రుజువు చేస్తున్నాయి. అందుకే జగన్ ఇపుడు బీజేపీని బాగా అర్ధం చేసుకోవాలనుకుంటున్నారు. ఆ పార్టీ తనకు దగ్గరా? దూరమా? అన్నది కూడా తేల్చుకోవాలనుకుంటున్నారు. ఇక మీదట జగన్ ఢిల్లీలో లాబీయింగ్ విషయంలో ఎవరినీ పట్టించుకోరని, ఎవరికీ బాధ్యతలు అప్పగించరని అంటున్నారు. తానే నేరుగా కేంద్ర పెద్దలతో వ్యవహారాలు సరిచూసుకోవాలని ఆయన భావిస్తున్నారుట. తాను బాధ్యతలు అప్పగించిన వారు అనుకున్న ఫలితాలు తేలేకపోతున్నారు. అదే సమయంలో వైసీపీ నిండా మునిగేలా పరిణామాలు వేగంగా సాగుతున్నా కూడా కీలక నేతలు నిస్తేజంగా చూస్తున్నారు. దాంతో జగన్ ఇక మీదట కేంద్రం తో డైరెక్ట్ కాంట్రాక్ట్ తో ఉండడమే కాదు బీజేపీకి తన అవసరం ఉందా లేదా అన్నది కూడా తెలుసుకోవాలనుకుంటున్నారుట. ఒక వేళ కాషాయం వేరే వ్యూహాలతో ఉంటే కనుక జాతీయ రాజకీయాల్లో జగన్ కొత్త మార్గాలను కూడా ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మొత్తానికి ఇటు తాడేపల్లినే కాదు అటు ఢిల్లీని కూడా బ్యాలన్స్ చేసుకోవడానికి జగనే దూకుడుగా కదులుతున్నారుట.

Related Posts