YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఆశావాహులకు కొండంత నిరాశ

ఆశావాహులకు కొండంత నిరాశ

టీఆర్ ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ప్లీనరీ వేదికగా చేసిన ప్రకటన ఆ పార్టీ నేతల్లో గుబులు రేపుతోంది. టీఆర్ ఎస్ ప్లీనరీ వేదికగా కేసీఆర్ చేసిన ప్రకటన ఆయా నేతలను కలవరపెడుతోంది. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా రూపొందించుకున్న కార్యాచరణపై ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పాత తరం నేతలు, తెలంగాణ ఉద్యమకారులకు టీఆర్‌ఎస్ లో సరైన స్థానం దక్కడం లేదని ఆరోపణలు ఉన్నాయి.వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కుతుందో లేదోనని భయాందోళన నెలకొంది. ” సిట్టింగ్ ఎమ్మెల్యేలంతా డైమన్లు, వచ్చే ఎన్నికల్లో వారికే టికెట్ లు ఇస్తాం ” అంటూ సీఎం కేసీఆర్ టీఆర్ ఎస్ ప్లీనరీలో ప్రకటించడంపై రాజకీయ దుమారం రేగుతోంది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాలపై కన్నేసిన ఆశావాహులు పూర్తిగా డోలాయామానంలో పడిపోయారు. ఎట్టి పరిస్థితుల్లోను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న నేతలకు కేసీఆర్ ప్రకటన మింగుడు పడటం లేదు.వరంగల్‌ జిల్లాలో మొత్తం పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో టీఆర్ ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఆ తర్వాత మారిన సమీకరణాల  న‌ర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి మినహా మిగిలిన ముగ్గురు (ఎర్రబెల్లి దయాకర్‌రావు, చల్లా ధర్మారెడ్డి, రెడ్యానాయక్) టీఆర్ ఎస్ లో చేరారు. ప్రస్తుతం జిల్లాలో టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య పదకొండుకు చేరింది. దీనికి తోడు తెలంగాణ ఏర్పాటు తర్వాత కాంగ్రెస్‌ టీడీపీలకు చెందిన ఇతర నేతలు గులాబీ గూటికి చేరారు. ఫలితంగా అన్నీ నియోజకవర్గాల్లో అధికార పార్టీ కిక్కిరిసిపోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఇతర నేతలు వచ్చే ఎన్నికల్లో టీఆర్ ఎస్ తరపున పోటీ చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. సిట్టింగ్ లకే సీట్లు కేటాయిస్తామని కేసీఆర్ ప్రకటించడంపై కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. కాగా 1,2 నియోజకవర్గాల్లో మార్పులు తప్పవు అన్న సీఎం వ్యాఖ్యలతో వీరిలో కొంత ఆశలు రేపుతున్నాయి. వాస్తంగా కేసీఆర్ ప‌లుసార్లు చేయించిన స‌ర్వేల్లో జిల్లాలో క‌నీసం ముగ్గురు ఎమ్మెల్యేల‌పై తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. వీరిని కొన‌సాగిస్తే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ సీట్లు కోల్పోవ‌డం ఖాయ‌మ‌న్న టాక్ ఇప్పటికే ఉంది.వరంగల్ నుంచి పోటీ చేసేందుకు ప‌లువురు ఆశావహులు రేసులో ఉన్నారు. దీంతో ఇప్పుడు కేసీఆర్ ప్రక‌ట‌న వారిలో కాస్త టెన్షన్ రేపినా ఆయ‌న వ్యాఖ్యలను పలువురు నాయకులు తేలికగా తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి వ్యూహాత్మకంగానే సిట్టింగ్లు అందరికి టికెట్ కేటాయిస్తామని ప్రకటించారని వారు పేర్కొంటున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ నేతలెవరూ పక్క పార్టీలవైపు చూడకుండా ఉండేందుకు, వారిని నమ్మించేందుకే కావాలని ఇలాంటి ప్రకటన చేసి ఉండొచ్చని పలువురు నేతలు భావిస్తున్నారు. ఏదేమైనా ప్లీనరీ వేదికగా టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి వరంగల్‌ జిల్లా అధికార టీఆర్ ఎస్ పార్టీలో పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి.

Related Posts