శివున్ని దర్భలతో పూజిస్తే - దీర్ఘాయుస్సు!
ఉమ్మెత్తలతో పూజిస్తే - సుతప్రాప్తి!
జిల్లేడు పూలతో పూజిస్తే - శౌర్యము !
కలువ పూలతో పూజిస్తే - విక్రమ వృద్ధి !
బంధూక సుమములతో పూజిస్తే - భూషణ ప్రాప్తి !
జాజి పూలతో అర్చిస్తే - వాహన ప్రాప్తి !
మల్లెపూలతో పూజిస్తే - భోగము ప్రాప్తిస్తాయి !
అవిసె పూలతో పూజిస్తే - పరమేశ్వర ప్రాప్తి !
కొండ గోగుపూలతో ఆరాధిస్తే - వస్త్ర లాభం !
నువ్వుల పువ్వులతో ఉమామహేశ్వరుణ్ణి పూజిస్తే - యౌవన ప్రాప్తి కలుగుతుంది !
తుమ్మి పువ్వులతో అర్చిస్తే - మోక్ష లాభం !
నందివర్థన పూజ - సౌందర్యాన్ని చేకూర్చుతుంది !
లోకహితం కోసం శివుడు ఎత్తిన అవతారాలు
ఓంకార స్వరూపుడైన శివుడు లోకహితం కోసం ఎన్ని రూపాలు ధరించాడు. ఈ విషయంపై శివపురణం ఓసారి తిరగేస్తే అందులో ఎనిమిది రూపాలు ధరించినట్లు పెర్కొంటోంది. అవేంటంటే....
రుద్రుడు !
భవుడు !
ఈశ్వరుడు !
ఉగ్రుడు !
భీముడు !
పశుపతి !
ఈశానుడు !
మహాదేవుడు !
1) రుద్రుడు : దుఃఖ నివారకుడైన అగ్నిని అదిష్టించి ఉంటాడు !!
2) ఈశ్వరుడు : జీవుల మనుగడ కోసం భూమిని అధిష్టించి ఉంటాడు !!
3) భవుడు : ఈ జగానికి అత్యంతావశ్యకమైన జలాన్ని ఆశ్రయించి ఉంటాడు !!
4) ఉగ్రుడు : జగత్తు కదలికలకు కారకుడై వాయువును అధిష్టించి ఉంటాడు !!
5) భీముడు : ఆకాశాన్ని ఆశ్రయించి ఉంటాడు !!
6) పశుపతి : సంసార బద్ధులైన జీవులను పాప విముక్తులను చేసేందుకై జీవాత్మను అధిష్టించి ఉంటాడు !!
7) ఈశానుడు : ఈ చరాచర జీవులను శాసించే సూర్యునలో ప్రకాశిస్తుంటాడు !!
8) మహాదేవుడు : తన చల్లని కిరణాలతో జీవులను పాలించు చంద్రునిలో ప్రకాశిస్తుంటాడు !!