హైదరాబాద్
హైదరాబాద్ లో చేపల మార్కెట్ లలో జపం పోటెత్తారు. మంగళవారం మృగశిర కార్తె కావడంతో చేపలు కొనుగోలు చేసేందుకు ప్రజలు ఎగబడ్డారు. మార్కెట్లలో కొనుగోలుదారులు భౌతిక దూరం పాటించడం లేదు. హైదరాబాద్ రాంనగర్ ని అతిపెద్ద చేపల మార్కెట్ కిటకిటలాడింది. కొవిడ్ నిబంధనలు పాటించకుండా మార్కెట్లలో రద్దీ కిక్కిరిసింది. ఓ వైపు పోలీసులు మందలిస్తున్నా జనం పట్టించుకోవడంలేదు. మృగశిర రోజు చేపలను తింటే ఆరోగ్యానికి మంచిదని...అందుకే అధిక సంఖ్యలో బారులు తీరారని చేపల నిర్వాహకులు అంటున్నారు.
మరోవైపు, మృగశిరకార్తె ప్రారంభం కానుండడంతో రైతులు పొలం పనులను ప్రారంభించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మృగశిరను పంటల సాగుకు శుభసుచకంగా భావించి రైతులు పండుగ జరుపుకోవడం అనాధిగా వస్తున్న ఆచారం. రోహిణికార్తెలో ఎండలతో సతమతమైన జీవకోటికి ఈ కార్తెలో వచ్చే నైరుతి రుతుపవనాలతో వాతావరణం పూర్తిగా చల్లబడి ఎంతో ఉపశమనం లభిస్తుంది. మృగశిర కార్తెను రైతులు ఏరువాక సాగే కాలం అని కూడా అంటారు.