ఏపీ ప్రతిపక్ష నాయకుడే దూకుడుగా ఉంటారనే వాదన ఉంది. ఆయన మాటలు కూడా కొన్నిమార్లు పరిధి దాటిపోతుండడం అందులో భాగంగానే చెప్పుకోవాలి. ఇక ఇప్పుడు జగన్ ని మించిన నాయకుడు తయారయ్యాడు వైసీపీ. జగన్ కన్నా దూకుడు ప్రదర్శిస్తున్నాడాయన. దాంతో ఇప్పుడు విజయసాయి రెడ్డి హాట్ టాపిక్ అవుతున్నారు. కొద్దిరోజులుగా విజయసాయి రెడ్డి వ్యాఖ్యల మీద పెద్ద స్థాయిలో చర్చ సాగుతున్న సంగతి తెలిసిందే.ఇక తాజాగా విజయసాయి రెడ్డి మరో సంచలన ప్రకటన చేశారు. ఏకంగా చంద్రబాబుని జైలుకి పంపించి తీరుతానని ఆయన శపథం చేశారు. తన లక్ష్యం అదేనని ప్రకటించారు. విశాఖలో జరుగుతున్న వంచన దీక్షలో మాట్లాడిన ఆయన సంచలన ప్రకటన చేశారు. చంద్రబాబుకి జైలు శిక్ష తప్పదంటూ వ్యాఖ్యానించి కలకలం రేపారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి ప్రకటన మరోసారి రాజకీయంగా ప్రకంపనలు పుట్టించే అవకాశం కనిపిస్తోంది.వాస్తవానికి చంద్రబాబు ని న్యాయవ్యవస్థలో ఎదుర్కోవడం ఎవరి తరం కూడా కాదన్నది కొందరి అభిప్రాయం. అనేక కేసులు ఇలా నీరుకారిపోవడానికి అదే కారణం అని భావిస్తుంటారు. ఇక అంబానీ మద్ధతు కూడా చంద్రబాబుకి ఉంది. ముఖేష్ అంబానీతో బాబు స్నేహం బహిరంగమే. ఈ నేపథ్యంలో రిలయెన్స్ ఆశీస్సులండగా చంద్రబాబుని కటకటాల్లోకి నెడుతానని విజయసాయి రెడ్డి చెబుతున్న మాటలే ఏమేరకు ఆచరణ రూపం దాలుస్తాయో చూడాలి.మరో వైపు ధ్రప్రదేశ్ లో అధికారం తమదేననే అంచనాలు వైసీపీలో పెరుగుతున్నాయి. వరుసగా మారుతున్న పరిణామాలతో తమకు తిరుగులేదనే ధీమాకు ఆపార్టీ శ్రేణులు వచ్చేస్తున్నాయి. కానీ కీలక ప్రాంతాల్లో ఆపార్టీని సమస్యలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో వైసీపీకి గడిచిన ఎన్నికల్లో బోల్తా పడింది. ఉభయ గోదావరి జిల్లాల్లో 34 స్థానాలకు గానూ కేవలం 5 స్థానాలు మాత్రమే దక్కించుకుంది. అవి కూడా తూర్పులోనే కావడం విశేషం. పశ్చిమాన బోణీ కూడా కొట్టలేకపోయింది. ఇక వచ్చే ఎన్నికల్లో పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవడం కోసం ఇప్పుడిప్పుడే సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టింది. అది వైసీపీని ఇబ్బందులకు గురిచేసే అవకాశం కనిపిస్తోంది 2016లో వైసీపీ తీర్థం పుచ్చుకుని. 2017 మునిసిపల్ ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసి, 2018 పార్టీ మారాల్సిన పరిస్థితిలో ముత్తా ఫ్యామిలీ ఉండడం విశేషంగా మారింది