YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రేషన్ డిపోల్లో నిలిచిపొనున్న సరుకులు

రేషన్ డిపోల్లో నిలిచిపొనున్న సరుకులు

రేషన్‌ డిపోల ద్వారా కార్డుదారులకు అందజేస్తున్న పంచదార, కిరోసిన్‌ ఇకనుంచి పంపిణీ నిలిచిపోనుంది. ఒకప్పుడు ఎన్టీఆర్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి రెండు రూపాయల కిలో బియ్యం పథకమే కారణం. అప్పటి నుండి ఇప్పటి వరకు పేదలకు పౌరసరఫరాల శాఖ ద్వారా సరఫరా చేస్తున్న రాయితీ బియ్యమే కాస్త నాలుగు మెతుకులు నోట్లోకి వెళ్లేందుకు ఉపయోపడుతున్నాయి. కాంగ్రెస్‌ హయాంలో పౌరసరఫరాల శాఖను బలోపేతం చేస్తూ 'అమ్మహస్తం' పేరుతో 9 రకాల నిత్యావసర సరుకులను రూ.185 రేషన్‌ డిపోల ద్వారా ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టింది. బియ్యంతోపాటు కేజీ కంది పప్పు, లీటరు పామాయిల్‌, కేజీ గోధుమ పిండి, అరకిలో పంచాదార, కేజీ ఉప్పు, ఆర కిలో చింతపండు, 250 గ్రాముల కారం పొడి, వంద గ్రాముల పసుపు, లీటరు కిరోసిన్‌ ఇచ్చేవారు దీంతో పండగల సమయంలో కాస్త సరుకులు ఇబ్బంది లేకుండా రాయితీపై సరుకులు లభించేవి. పేదలకు రెండు పూటలా అయినా అన్నం లభించేది. కేసీఆర్‌ ప్రభుత్వం కాస్త ముందుకు దిగొచ్చి ఒక్కరూపాయికే కిలో బియ్యం అని, ఒకరికి ఆరు కిలోలు ఇస్తున్నామని చెప్పడంతో జనం ఆనందించారు. బంగారు తెలంగాణలో మూడు పూటలా తినొచ్చనుకున్న పేదలకు, డీలర్లకు, హమాలీలు భావించారు. కానీ అంతలోనే కేసీఆర్‌ ప్రభుత్వం చేపట్టే సంస్కరణలు ఒక్కపూట తిండి కూడా దొరికే పరిస్థితి లేకుండా చేసేలా కనిపిస్తోంది. దీనికి కారణం ఇదివరకు ఇచ్చే 9 రకాల సరుకులను కాస్త బియ్యం, పంచదార, కిరోసిన్‌కు తగ్గించేసింది. తర్వాత చక్కెరను కూడా వదిలించుకుంది. మరోవైపు రెండు లీటర్ల కిరోసిన్‌ స్థానంలో ఒక లీటరే అందిస్తోంది. ఇక బియ్యం మాత్రమే దిక్కవుతున్నాయి. ఈ సమయంలో వీటికీ ఎసరు పెట్టాలని యోచిస్తోంది. ప్రతి లబ్దిదారుడికి నగదు బదిలీ పథకం అమలు చేయాలని యోచిస్తోంది. ఇదే జరిగితే ప్రజలు నగదు బదిలీ డబ్బులతో బియ్యం కొనుగోలు చేస్తారు. కొన్ని రోజుల తర్వాత డీలర్‌ వ్యవస్థను క్రమంగా ఎత్తేసే పరిస్థితి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే ఇప్పటి వరకు లబ్దిపొందుతున్న పేదలు, హమాలీలు, డీలర్లు అవస్థలు పడడం తప్పని పరిస్థితిగా ఉంది. అర్హులందరికీ ప్రభుత్వం దీపం పథకం కింద గ్యాస్‌కనెక్షన్లు ఇస్తోంది. దీంతో అందరికీ గ్యాస్‌ను రాయితీపై ఇస్తున్నందున కిరోసిన్‌ ఎందుకివ్వాలనే ఆలోచనతో ఒక లీటర్‌కే పరిమితం చేసింది. ప్రస్తుతం మైదాన ప్రాంతానికి ఈనెల నుంచి కిరోసిన్‌ పంపిణీ పూర్తిగా నిలిపేయాలని నిర్ణయించింది. కేవలం ఏజెన్సీలో వంటగ్యాస్‌ లేని వారికి మాత్రమే కిరోసిన్‌ ఇవ్వనున్నారు. వంటగ్యాస్‌ అందించిన తర్వాత వారికి కూడా నిలిపేయనున్నారని తెలుసోంది. గ్యాస్‌ కనెక్షన్ల పంపిణీ పూర్తయితే జిల్లాకు ఒక చుక్క కిరోసిన్‌ వచ్చే అవకాశం లేదు. దీంతో బియ్యం మాత్రమే మిగులుతాయి. వీటికి నగదు బదిలీ పథకాన్ని అమలు చేయాలని యోచిస్తోంది. అయితే పేదలతోపాటు రేషన్‌ డీలర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందన్న ఉద్దేశంతో ఆ ప్రయత్నాన్ని తాత్కాలికంగా విరమించుకుంది. రేషన్‌ షాపుల ద్వారా పంపిణీ చేసే సరుకులు ఒక్కోక్కటిగా తగ్గిపోవడంపై రేషన్‌ డీలర్లు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. బియ్యం ఒక్కటే అమ్మడం వల్ల తమకేమీ గిట్టుబాటు కాదని ఆవరు సమ్మెకు సిద్ధమవుతున్నారు. మరోవైపు నగదు బదిలీ కోసం బ్యాంకు ఖాతా, ఆధార్‌ సంఖ్యను డీలర్ల వద్ద నమోదు చేయిస్తుండంతో ఇది భవిష్యత్తులో పేదలకు ఇబ్బందులు తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది. తెల్ల రేషన్‌ కార్డు ఉన్నవారికి అరకిలో పంచదార రూ. 6.75 పైసలకు, వంటగ్యాస్‌ కనెక్షన్‌ లేనివారికి 2 లీటర్లు కిరోసిన్‌, లీటరు రూ. 19.75 పైసలు చొప్పున అందించేవారు. కిలో పంచదారపై కేంద్ర ప్రభుత్వం ఇంత వరకు ఇచ్చే సబ్సిడీని ఇక ఇవ్వలేమంటూ చేతులెత్తేసింది. బడా పారిశ్రామిక వేత్తలకు, కార్పొరేట్లకు రాయితీలు ఇస్తున్న ఈ ప్రభుత్వాలకు పేదలు పొందుతున్న పంచదార, కిరోసిన్‌లకు రాయితీ కొనసాగించేందుకు మీన మేషాలు లెక్కిస్తున్నాయి. పేదలకు, వ్యవసాయరంగానికి వ్యవసాయాధిరిత రంగాలకు కొనసాగుతూ ఉన్న సబ్సీడిలను కార్పొరేట్లతో పెనవేసుకొని పాలన సాగిస్తున్న ఈ ప్రభుత్వాలు భారంగా భావిస్తున్నాయి. చంద్రన్న సంక్రాంతి, క్రిస్మస్‌, రంజాన్‌ పండగ దినాల్లో ఉచితం పేరుతో అరకొరగా ఇస్తున్న సరుకులిచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంటోంది. ఈ పండగ దినాల్లో తన ప్రచారానికే సరుకుల పంపిణీ వాడుకుంటోందంటూ పలు విమర్శలు ఎదుర్కొంటుంది. ప్రభుత్వం సంక్రాంతి పండగ నేపథ్యంలో అరకిలో చొప్పున చెనగపప్పు, కందిపప్పు, బెల్లం, కిలో గోధుమపిండి, 200 గ్రాములు నెయ్యి, అరలీటరు పామాయిల్‌ ప్రభుత్వం ఇచ్చింది. రంజాన్‌ సందర్భంగా 2 కిలోలు చొప్పున సేమ్యా ప్యాకెట్‌, పంచదార, గోధుమ పిండి, 200 గ్రాములు నెయ్యి అందజేసింది.టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దినెలల వరకు మాత్రమే పంచదార, కిరోసిన్‌, బియ్యం, గోదుమలు, గోధుమపిండి, కందిపప్పు, పామాయిల్‌ ఇచ్చేవారు. దశలవారీగా గోధుములు, గోధుమపిండి, కందిపప్పు పంపిణీని నిలిపివేశారు. తాజాగా మే నుంచి పంచదార, జూన్‌ నుంచి కిరోసిన్‌ను ప్రభుత్వాలు నిలిపివేస్తున్నాయి. కాల క్రమంలో రేషన్‌ డిపోలను కూడా ప్రభుత్వం ఎత్తివేస్తుందేమోనన్న ఆందోళన పేదల్లో నెలకొంది. కిలో పంచదార బహిరంగ మార్కెట్లో సుమారు రూ. 40 ధర పలుకుతోది. రేషన్‌ డిపో ద్వారా అరకిలో రూ. 6.75 పైసలకు లభించేది. పేదలు బహిరంగ మార్కెట్లో పంచదారను ఎలా కొనగలరని పలువురు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. 

Related Posts