విజయవాడ జూన్ 8
ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లుల జాబితాను సిద్ధం చేయాలని డీఎంఅండ్‌హెచ్‌వోలకు డీహెచ్ డాక్టర్ గీతా ప్రసాదిని ఆదేశాలు జారీ చేశారు. వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ దీనిపై సమీక్షించి ఇప్పటికే పలు ఆదేశాలిచ్చారని ఆమె తెలిపారు. భవిష్యత్తులో కోవిడ్ మూడోవేవ్ వ్యాప్తికనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లులకు వెంటనే టీకాలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ప్రతి గ్రామంలోనూ ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లుల జాబితాను సిద్ధం చేసేలా వైద్యాధికారుల్ని సన్నద్ధం చేయాలని, అర్హులైన తల్లులందరికీ ఒక రోజు ముందుగానే వ్యాక్సినేషన్ టోకెన్లు పంపిణీ చేయాలని సూచించారు. టోకెన్‌లో సూచించిన తేదీ, సమయం ప్రకారం ఎఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమీపంలోని కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలకు వారిని తరలించాలని గీతాప్రసాదిని ఆదేశించారు.