సవికాలంలో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రభుత్వం గ్రామ సర్పంచుల ఆధ్వర్యంలో చలివేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆయా గ్రామాల్లో చలివేంద్రాలను అట్టహాసంగా ప్రారంభించినప్పటకీ నిర్వహణ మాత్రం గాలికొదిలేశారు. గుంటూరు అర్బన్ లో పోలీసుచలివేంద్రాలు ప్రతి పోలీస్ స్టేషన్ పరిదిలోమ ఏర్పాటుచేస్తున్నారు...వేసవి నేపద్యంలో ప్రజలకు త్రాగునీటిని అందించేందుకు యస్పీ విజయరావు ఆయా స్టేషన్ ల పరిధిలోనిజంక్షన్ లలో చలివేంద్రాలు ఏర్పాటుచేయించారు...యస్పీ ఆదేశాలతో నల్లపాడు పోలీసుస్టేషన్ పరిధిలోని గోరంట్ల సమీపంలో గల ఇన్నర్ రింగ్ రోడ్డు జంక్షన్ వద్ద ఎర్పాటుచేసిన పోలీస్ చలివేంద్రంను అడిషనల్ ఎస్పీ వైటి నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సౌత్ డిఎస్పీ మూర్తి, సీఐ బాల మురళీకృష్ణ మరియు సిబ్బంది పాల్గొన్నారు.కొత్తపల్లి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో, మజరా గ్రామాల్లో చలివేంద్రాలుతూతూమంత్రంగా నడుస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో వేసవి ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకూ చలివేంద్రాల వద్ద నీరుపోసే నాథుడే కరువయ్యాడు. చలివేంద్రాల్లో ఏర్పాటు చేసిన డ్రమ్ముల్లో నీరు ఉండడం లేదు. వాటిని శుభ్రం చేయకుండా అలాగే వదిలేస్తున్నారు. గ్రామంలో ఎవరైనా సేవాభావం కల్గిన వారు చలివేంద్రాల వద్దకు వెళ్లి డ్రమ్ములను శుభ్రం చేసి వాటిలో ప్రతిరోజు నీరు పోస్తున్న సంఘటనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ కేంద్రాలు పూర్తిస్థాయిలో నిర్వహించడం లేదు. కొత్తపల్లి మండలంలో 20 మజ్జిగ కేంద్రాలు ఉన్నాయి. వీటి నిర్వహణ కోసం ప్రతి రోజూ 4 లీటర్ల పెరుగు ఇచ్చి గ్రామస్తులందరికీ మజ్జిగ పంపిణీ చేయాలి. పంపిణీ చేసేందుకు ఒకరిని నియమించి, వారికి ప్రతిరోజు రూ.100 చొప్పున ఇస్తున్నారు. అయినప్పటికీ వాటిని తూతూమంత్రంగానే నిర్వహిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో 4 లీటర్ల పెరుగుకు గాను 2 లీటర్లే మజ్జిగ చేస్తున్నారని, మిగతా వాటిని నిర్వాహకులు కాజేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో మజ్జిగ కేంద్రాలు, చలివేంద్రాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.